మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపి అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ ఉదయం ఐదున్నర గంటలకు పులివెందులలోని ఆయన నివాసానికి చేరుకున్న పదిమంది సభ్యుల సిబిఐ బృందం అదుపులోకి తీసుకుంది. ఈ సమాచారాన్ని ఆయన భార్య లక్షిదేవికి తెలియజేసింది. తొలుత గంటకు పైగా విచారించిన సిబిఐ తదుపరి ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు వెల్లడించింది. భాస్కర్ రెడ్డి పిఎ రాఘవరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ రెడ్డి మొబైల్ ను సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
భాస్కర్ రెడ్డిని పులువెందుల నుంచి హైదరాబాద్ తరలించారు. కాసేపట్లో ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన్ను సిబిఐ జడ్జి ముందు హాజరు పరుస్తారు. సిబిఐ కస్టడీకి అడిగే అవకాశం ఉన్నట్లు సమాచారం,