Tuesday, September 24, 2024
HomeTrending NewsViveka Murder Case: వ్యక్తుల లక్ష్యంగా సిబిఐ విచారణ : వైఎస్ అవినాష్

Viveka Murder Case: వ్యక్తుల లక్ష్యంగా సిబిఐ విచారణ : వైఎస్ అవినాష్

వివేకా హత్య కేసులో తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటామని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దర్యాప్తులో కీలక అంశాలను సిబిఐ విస్మరిస్తోందని, పోలీసులకు సమాచారమిచ్చిన తననే దోషిగా చూపిస్తున్నారని, తాము చెప్పిన అంశాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేటి ఉదయం అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.  పులివెందులలో అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఊహించని విధంగా తన తండ్రిని అదుపులోకి తీసుకున్నారని, దీనితో ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా తమ నిజాయితీని నిరూపించుకుంటామని ఆయన  స్పష్టం చేశారు.  కీలక అంశాలను విస్మరించి, సిల్లీ అంశాలను తెరపైకి తెస్తోందని ఆరోపించారు. వాస్తవాల ఆధారంగానే కేసును దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన కొత్త దర్యాప్తు బృందాన్ని ఏప్రిల్ 3 న కోరామని, అయినా పాత బృందం చేసిన విచారణనే కొనసాగిస్తోందని అన్నారు. దస్తగిరి స్టేట్ మెంట్ ఆధారంగా కేసులు విచారిస్తోన్న సిబిఐ దానిలోని అనేక కీలక అంశాలను పరిశీలించాలని తాము కోరుతున్నామన్నారు.  వ్యక్తులను లక్ష్యంగా చేసుకొనే విచారణ సాగుతోందని, ఏ4కు ఎందుకింత రిలీఫ్ ఇస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు.

మరోవైపు, రేపు మధ్యాహ్నం హైదరాబాద్ లోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని వైఎస్ అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు ఇచ్చింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్