దేశంలో ప్రభుత్వం రంగంలో కాన్సర్ ట్రీట్మెంట్ కి 2 వ అతి పెద్ద ఆసుపత్రిగా ఎం ఎన్ జే నిలిచిందని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వం పరంగా 60కోట్లతో ఇక్కడ అన్ని సదుపాయలు కల్పించామని తెలిపారు. హైదరాబాద్ ఎం ఎన్ జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో నూతన అంకాలాజీ బ్లాకు ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావుప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్,ఎమ్మెల్సీ ప్రభాకర్,మేయర్ గద్వాల్ విజయలక్ష్మి,టి ఎస్ ఎం ఎస్ ఐ డి సి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, అరబిందో ఎం. డి నిత్యనంద రెడ్డి, అరబిందో డైరెక్టర్ రఘునాథన్, హెల్త్ సెక్రటరీ రిజ్వి, ఎం ఎన్ జే ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జయలత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు కామెంట్స్
ఎం ఎన్ జే చారిత్రక ఆసుపత్రిలో నూతన బ్లాకును అందించినందుకు అరబిందో ఫార్మా కు ధన్యవాదాలు. ఈ బిల్డింగ్ రావడంతో పడకల సంఖ్య 750 కి పెరిగింది. కొత్త బ్లాక్ లో ప్రత్యేకంగా విమెన్ వింగ్, పీడియాట్రిక్ వింగ్ రానున్నాయి. చికిత్స కోసం వచ్చే చిన్నారుల చదువు దెబ్బ తినకుండా ఉండేందుకు పీడియాట్రిక్ వింగ్ లో లైబ్రరీ, టీచర్ ను ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ తో పాటు విద్యను కూడా అందిస్తాం. బోన్ మ్యారో ట్రాన్సప్లాంటేషన్ కు ప్రత్యేకంగా వార్డ్ ఏర్పాటు చేశాం., వీరికి ఆరోగ్యశ్రీ కింద జీవితాంతం మందులు ఉచితంగా ఇస్తాం. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వైద్య సేవలను ఎంతో పటిష్టం చేస్తున్నాం. గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఏం ఎన్ జే వంటి హాస్పిటల్ బలోపేతం చేశారు. మరోవైపు నాలుగు టిమ్స్, వరంగల్ హెల్త్ సిటీ, నిమ్స్ విస్తరణతో 10వేల పడకలు సూపర్ స్పెషలాటి బెడ్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఇవి మరో ఏడాదిలో అందుబాటులోకి వస్తాయి.
వైద్య విద్యకు కూడా ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నది. ఈ సంవత్సరం మరో 9మెడికల్ కాలేజీ లు ప్ర్రారంభిస్తాము. తెలంగాణ వస్తే ఏం వస్తుంది అనే వాళ్ళుకు ఇవే సమాధానం. 2014లో 20 మెడికల్ కాలేజీలు ఉంటే.. 2022 నాటికి 46కు చేరుకున్నాయి. ఈ ఏడాదితో 55 అవుతాయి. 65 ఎండ్లలో 20 మెడికల్ కాలేజీలు వస్తె.. 9 ఎండ్లల్లోనే 35 కాలేజీలు తెచ్చాము. మెడికల్ సీట్లు నాడు 2950 ఉంటే ఇప్పుడు 7990 కి పెరుగుతాయి.
తెలంగాణ వచ్చినప్పటి నుంచి కాన్సర్ కి సంబంధించి ఆరోగ్యశ్రీ ద్వారా 800 కోట్ల ఖర్చు చేసింది. గత సంవత్సరం 137కోట్లు కేవలం కాన్సర్ పేషెంట్స్ కి ఖర్చు చేసాం. కాన్సర్ రోగులకు త్వరలో జిల్లాల్లో కీమో ధెరఫీ ప్ర్రారంభించాబోతున్నాము. రేడియో ధెరఫీ ని కూడా జిల్లాలు ప్రారంభిస్తాం. టి డయాగ్నోస్టిక్ సెంటర్స్ ద్వారా కాన్సర్ డిటెక్షన్ చేయనున్నాం.