మైత్రీ మూవీ మేకర్స్. శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన మైత్రీ సంస్థ జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య.. ఇలా వరుసగా బ్లాక్ బస్టర్ మూవీస్ అందించింది. అనతి కాలంలోనే టాప్ ప్రొడక్షన్ హౌస్ గా నిలిచింది. అయితే.. ఈ నిర్మాణ సంస్థ పై ఐటీ సోదాలు చేయడం.. అది కూడా ఢిల్లీ నుంచి అధికారులు వచ్చి సోదాలు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ నిర్మాణ సంస్థతో పాటు సుకుమార్ ఆఫీస్లో కూడా సోదాలు చేయడం జరిగింది.
మూడు రోజులుగా ఐటీ సోదాలు చేయడంతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ కు అస్వస్థతకు గురి కావడం హాస్పటల్ లో జాయిన్ కావడం జరిగింది. ఈ ప్రభావం ‘పుష్ప 2’ షూటింగ్ పై పడింది. ఇటీవల పుష్ప-2 సినిమాకు సంబంధించి భారీ షెడ్యూల్ స్టార్ట్ చేశారు.అల్లు అర్జున్, మరి కొంతమంది విదేశీ ఫైటర్ల పై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి కొన్ని స్టిల్స్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అయితే…తాజా సోదాలతో ఈ షెడ్యూల్ ను మధ్యలోనే నిలిపివేశారు. తాజా సమాచారం ప్రకారం, మైత్రీ మూవీ మేకర్స్ కు సంబంధించి అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు, షూటింగ్ లు నిలిచిపోయాయి.
మళ్లీ అంతా సెట్ అయి ట్రాక్ లోకి రావడానికి టైమ్ పడుతుంది. ఈ సోదాల ప్రభావం హీరో,హీరోయిన్ల కాల్షీట్ల పై కూడా పడింది. అల్లు అర్జున్ తో పాటు రష్మిక కాల్షీట్లు రద్దయినట్టు తెలుస్తోంది. అంతేకాదు, మరో 2 రోజుల్లో జరగాల్సిన వీరసింహారెడ్డి వంద రోజుల ఫంక్షన్ పై కూడా అనుమానాలు నెలకొన్నాయి. 23న వీరసింహారెడ్డి వంద రోజుల వేడుకను గ్రాండ్ గా నిర్వహించాలి అనుకున్నారు. చూస్తుంటే.. ఈ వేడుక పోస్ట్ పోన్ అయ్యేట్టు కనిపిస్తుంది. మొత్తానికి మైత్రీ పై ఐటీ సోదాలు ఓ షాక్ అని చెప్పచ్చు. మరి.. ఈ సోదాలు ఎంత వరకు వెళతాయో..? చివరికి ఏం తెలుస్తారో..?