Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్IPL: లక్నోపై గుజరాత్ పైచేయి

IPL: లక్నోపై గుజరాత్ పైచేయి

గుజరాత్ జెయింట్స్ మరోసారి సత్తా చాటింది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 135 లక్ష్యాన్ని కాపాడుకొని విజయం సాధించింది. పరుగుల వేటలో లక్నో చతికిలబడింది. గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ చివరి ఓవర్లో రెండు వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అందుకున్నారు.

లక్నోలోని  భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి ఏక్తా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు 4 వద్ద శుభ్ మన్ గిల్ డకౌట్ అయ్యాడు. వృద్ధిమాన్ సహా- కెప్టెన్ పాండ్యా కలిసి రెండో 68 పరుగులు జోడించారు. సాహా 37 బంతుల్లో 6 ఫోర్లతో 47;  పాండ్యా 50 బంతుల్లో 2 ఫోర్లు, 4సిక్సర్లతో 66 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.

లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా, స్టోనిస్ చెరో రెండు; నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రా చెరో వికెట్ సాధించారు.

లక్ష్య సాధనలో లక్నో ఆరంభం మెరుగ్గానే ఉంది. తొలి వికెట్ (కేల్ మేయర్స్-24) కు 55 పరుగులు చేసింది. క్రునాల్ పాండ్యా 23 రన్స్ చేసి ఔటయ్యాడు. ఈ దశ నుంచి లక్నో వెనకబడింది. నికోలస్ పూరన్ (1); ఆయూష్ బదోనీ (8 రనౌట్); స్టోనిస్ డకౌట్ తో కస్తాల్లో పడింది. కెప్టెన్ కెఎల్ రాహుల్ చివర్లో భారీ షాట్లు ఆడడంలో ఇబ్బంది పడ్డాడు. చివరి ఓవర్లో రెండో బంతికి వెనుదిరిగాడు. రాహుల్ 61 బంతుల్లో 8 ఫోర్లతో 68  పరుగులు చేశాడు, 20 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులే చేసింది.

గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ, నూర్ అహ్మద్ చెరో రెండు; రషీద్ ఖాన్ ఒక వికెట్ సాధిచారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్