Sunday, November 24, 2024
HomeTrending NewsCM Review: ధాన్యానికి మరింత ధర: సిఎం సూచన

CM Review: ధాన్యానికి మరింత ధర: సిఎం సూచన

వైఎస్సార్ రైతు భరోసా లోమడ ఈ ఏడాది తొలి విడత నిధులు జమ చేసేందుకు సిద్ధం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన రైతుల జాబితాలను వెల్లడించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎం సూచించగా, మే 10 కల్లా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తామని తెలిపిన అధికారులు తెలిపారు.  ఆర్బీకేల్లో ఖాళీగా ఉన్న467 వీఏఏ, 1644 వీహెచ్‌ఏ, 23 వీఎస్‌ఏ, 64 వీఎఫ్‌ఏ పోస్టులు… 4,656 ఏనిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకీ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు.

ధాన్యం సేకరించిన తర్వాత రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని, ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే, లేదా ధాన్యం కొనుగోలుకు అక్కడకు ఇక్కడకు వెళ్లమని ఎవరైనా చెప్తే ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబరు 1967 కూడా తప్పనిసరిగా పొందుపరచాలని సిఎం స్పష్టం చేశారు.

ధాన్యానికి మరింత ధర వచ్చేలా…  విదేశాల్లో డిమాండ్‌ఉన్న వంగడాలను సాగు చేయడంపై రైతుల్లో అవగాహన కల్పించాలని సిఎం విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఎగుమతులు పెరిగి వారికి మంచి ధర వస్తుందని, రైతులకు అవసరమైన వంగడాలు, వాటి విత్తనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.

ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక గోడౌన్‌ ఉండాలన్న నిర్ణయంలో భాగంగా ప్రస్తుతం  1005 చోట్ల గోడౌన్ల నిర్మాణం చేపట్టామని, 206 కుపైగా పూర్తయ్యాయని, మరో 93 గోడౌన్లు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయని మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు వివరణ ఇచ్చారు.

నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందిస్తున్న ప్రక్రియ మరింత సమర్థవంతంగా ముందుకుసాగాని, ప్రతిఏటా ఈ పంపిణీ మొత్తం పెరగాలని సిఎం అన్నారు.

ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాలశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు  ఉన్నతాధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్