మైత్రీ మూవీ మేకర్స్ వరుసగా బ్లాక్ బస్టర్ మూవీస్ అందించింది. అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హాస్ అయ్యింది. శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ సంస్థను ప్రారంభించిన మైత్రీ.. ఆతర్వాత జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య.. ఇలా వరుసగా బ్లాక్ బస్టర్ మూవీస్ అందించి భారీ లాభాలు దక్కించుకుంది. పుష్ప సినిమాతో బాలీవుడ్ లో మైత్రీ సంస్థ పేరు బాగా మారుమ్రోగింది. అంతే కాకుండా ప్రభాస్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో మూవీని నిర్మించి బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలి అనుకుంది.
అందుకోసం ప్రభాస్, సిద్ధార్థ్ ఆనంద్ కు భారీగా అడ్వాన్సులు కూడా ఇచ్చింది. అయితే.. ఊహించని విధంగా ఇన్ కమ్ టాక్స్ అధికారులు మైత్రీ సంస్థ పైన, ఈ సంస్థతో అనుబంధం ఉన్న డైరెక్టర్ సుకుమార్ ఆఫీస్లో, ఇంటిలో కూడా సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు వరుసగా ఐదు రోజులు జరగడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ సోదాలు నేపధ్యంలో మైత్రీ నిర్మాతల్లో ఒకరైన నవీన్ అస్వస్థకు గురై హాస్పటల్ లో జాయిన్ కావడం కూడా జరిగింది. సుకుమార్ ‘పుష్ప 2’ షూటింగ్ బ్రేక్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే… ఐదు రోజుల సోదాలు చేసి ఇన్ కమ్ టాక్స్ అధికారులు వెళ్లిపోయారు.
హమ్మయ్య అయిపోయింది అని మైత్రీ సంస్థ నిర్మాతలు హ్యాపీగా ఫీలవుతున్నారు కానీ… ఇప్పుడు హీరోలకు టెన్షన్ స్టార్ట్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. కారణం ఏంటంటే… మైత్రీ సంస్థ నిర్మాతలు వాట్సాప్ ఛాటింగ్ కూడా అధికారులు చూడడం జరిగిందట. ఇందులో ఏ ఏ హీరోకు ఎంత అడ్వాన్స్ ఇచ్చారో.. ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో క్లియర్ గా ఉందట. ఈ విషయం తెలిసిన హీరోలు తమ లెక్కలను కూడా అడుగుతారా..? సోదాలు చేస్తారేమో అని తెగ టెన్షన్ పడుతున్నారట. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. మరి… ఏం జరగనుందో చూడాలి.