Sunday, November 24, 2024
HomeTrending NewsNirudyoga Nirasana: నిరుద్యోగులతో చెలగాటం - రేవంత్ రెడ్డి

Nirudyoga Nirasana: నిరుద్యోగులతో చెలగాటం – రేవంత్ రెడ్డి

“తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి శాసనసభలో 1 లక్ష 7వేలు ఖాళీలు ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. వాటిని సంవత్సరంలోగా భర్చీ చేస్తామన్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని నివేదిక ఇచ్చింది. అంటే తొమ్మిదేళ్లలో ఉన్న ఉద్యోగాలు పోయాయి తప్ప.. కొత్త ఉద్యోగాలు రాలేదు” అని కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. సోమవారం ఖమ్మంలో ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి మయూరి సెంటర్ వరకు జరిగిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మయూరి సెంటర్ వద్ద నిర్వహించిన జనసభలో ప్రసంగించారు.
ఖమ్మం జిల్లా నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందన్నారు రేవంత్. 1969లో కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌’కోసం అక్కడి ప్రాంత వాసులు 1300 ఎకరాలను ఇచ్చారు. అయినా స్థానికులకుకాకుండా ఆంధ్రా ప్రాంతం వారికి ఉన్నత ఉద్యోగులు ఇవ్వడం ప్రారంభించారు. ఈ అన్యాయాలను కొలిశెట్టి రామదాసు వెలుగులోకి తెచ్చారు. మా ఉద్యోగాలు మాకు కావాలంటూ తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లాలోనే మొదలైంది. తర్వాత రవీంధ్రనాథ్ అనే విద్యార్థి ఖమ్మం గాంధీ చౌక్లో దీక్ష చేశారు. ఇవన్నీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచాయని రేవంత్ అన్నారు. ఖమ్మం జిల్లా అనేక పోరాటలకు వేదికగా నిలిచింది. ఇక్కడి కమ్యూనిస్టులు కూడా అన్యాయాలపై పోరాటం చేశారు. కానీ వారందరూ ఇప్పుడు ఎవరి పక్కనో ఉన్నారు చూసుకోవాలని కమ్యూనిస్టులకు రేవంత్ చురకులు అంటించారు.
రాష్ట్రంలో 50 లక్షల మంది విద్యార్థి నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది అని రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. “నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం కావాలని కేసీఆర్ చెప్పిండు. తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లయినా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదు. తెలంగాణ నిరుద్యోగులకు, మేధావులకు, అమరుల కుటుంబాలకు నేను గుర్తు చేయదలచుకున్నా. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి శాసన సభలో 1 లక్ష 7వేలు ఖాళీలు ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. వాటిని సంవత్సరంలోగా భర్చీ చేస్తామన్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని నివేదిక ఇచ్చింది. అంటే తొమ్మిదేళ్లలో ఉన్న ఉద్యోగాలు పోయాయి తప్ప.. కొత్త ఉద్యోగాలు రాలేదు” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణలో నిరుద్యోగుల జరుగుతున్న అన్యాయంపై ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 2021 అక్టోబరులో మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతా చారి విగ్రహానికి నివాళులు అర్పించి నిరుద్యోగ జంగ్ సైరన్ మోంగించాం అన్నారు రేవంత్ రెడ్డి. మా పోరాట ఫలితంగానే 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ మారిండేమో అనుకున్నాం..కానీ ఇవాళ జరిగిందేంటో మీకు తెలిసిందే…రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు బజార్లో దొరుకుతున్నాయి..టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. అర్హత లేని వారి టీఎస్పీఎస్సీ సభ్యులుగా నియమించారని రేవంత్ విమర్శించారు.
విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చేలగాటమాడుతోంది. పంపకాల్లో తేడాలు వచ్చి విషయం బయటపడింది తప్ప ప్రభుత్వం చేసిందేం లేదు..మేం నిలదీస్తే విచారణ అధికారులు మాకు నోటీసులు ఇచ్చారు. కొడుకును మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటే కేసీఆర్ నాకు నోటీసులు పంపిండు..నాపై ఇప్పటికే..130 కేసులు పెట్టినవ్ కేసీఆర్… ఇంతకంటే ఇంకేం చేస్తావ్. నీ కేసులకు భయపడేటోడు ఎవడూ లేడు ఇక్కడి అని ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
తెలంగాణలో నిరుద్యోగులకు అండగా నిలవడానికి హైదరాబాద్ లో జరిగే నిరుద్యోగ నిరసన సభకు ఇందిరమ్మ మనుమరాలు ప్రియాంక గాంధీ హాజరవుతారు. ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా ప్రజలను కోరుతున్నా. ఖమ్మం జిల్లాలో ఒంటి కన్ను శివరాసన్ ను పాతాళానికి తొక్కేయాలి. జిల్లాలో 10కి 10 సీట్లు కాంగ్రెస్ కు ఇవ్వండి…. రాష్ట్రంలో నూటికి 90 సీట్లు తెచ్చే బాధ్యత మేం తీసుకుంటామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

పిల్లలమర్రిలో రైతుల సమస్యలు తెలుసుకున్న రేవంత్
ఖమ్మం నిరుద్యోగ నిరసన ర్యాలీకి వెళ్లే క్రమంలో సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆగి ధాన్యం కొనుగోలు తీరు తెన్నులను రైతులను అడిగి తెలుసుకున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రైతులు తమ కష్టాలను వారికి వివరించారు. గతంలో టార్ఫాలిన్ పట్టాలైన తమకు ఇచ్చేవారని ఇప్పుడు అవి కూడా ఇవ్వడం లేదన్నారు. పైగా ధాన్యం తూకం వేశాక కొనుగోలు కేంద్రం నుండి ధాన్యం బస్తాలు ఎగుమతి అయ్యేవరకు రైతులని బాధ్యులను చేస్తున్నారని, దీంతో తూకం వేసిన ధాన్యం బస్తాలను కూడా తామే వర్షాల నుండి కాపాడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. క్వింటాల్ కు ఐదు శాతం కోతలు పెడుతూ కూడా టార్ఫాలిన్లు ఇవ్వకుండా, తూకం వేసిన ధాన్యం బస్తాల బాధ్యతను తీసుకోకుండా రైతుల నెత్తిపై వాటి సంరక్షణ భారం మోపడం అన్యాయంగా ఉందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఐదు రోజులుగా తీసుకెళ్లడం లేదని, దీంతో అమ్మకానికి 20 రోజులకు పైగా కొనుగోలు కేంద్రంలో పడిగాపులు పడుతున్నామని, తూకం వేసాక కూడా బస్తాల ఎగుమతి జరిగే వరకు ఇక్కడే మరిన్ని రోజులు ఉండాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తుందని, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందన్నారు. రైతులు అధైర్య పడవద్దని, వారికి అండగా కాంగ్రెస్ నిలబడుతుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్