Friday, September 20, 2024
HomeTrending NewsT-SAVE: పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలి - గద్దర్

T-SAVE: పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలి – గద్దర్

T-SAVE ఐక్య కార్యాచరణలో నిరుద్యోగుల కోసం చేస్తున్న పోరాటానికి అందరూ మద్దతుగా రావాలని ప్రజా గాయకుడు గద్దర్ పిలుపు ఇచ్చారు. ys షర్మిల యువతకు ఉద్యోగాల కోసమే పోరాటాలు మొదలుపెట్టిందన్నారు. నిరుద్యోగ సమస్యలపై T-SAVE ఆధ్వర్యంలో అఖిల పక్షం చేస్తున్న నిరాహార దీక్షకు గద్దర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చదువుకోని వాళ్లు పెళ్లిళ్లు చేసుకొని పిల్లలతో జీవితంలో స్థిరపడి పోతుంటే చదువుకున్న వాడు ఉద్యోగం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ దేశంలో చూసినా యువశక్తిని వాడుకొని ఎదుగుతుంటే మన దేశంలో మాత్రం యువతకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.


పోలీసులకు ఆమెను తాకే హక్కు, తోసేసే హక్కు ఎవరిచ్చారు? షర్మిలకే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే సామాన్య మనుషుల పరిస్థితి ఏంటని గద్దర్ ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం పోలీస్ డిపార్ట్ మెంట్ మాత్రమే కొలువులొచ్చాయి.. ఇంకా దేంట్లో రాలేదన్నారు. ముఖ్యమంత్రి డబ్బుతోనే గెలుస్తామనే వాతావరణాన్ని తీసుకొచ్చారు. దీన్ని తిప్పికొట్టడం ప్రజలకే సాధ్యమన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కన్నీళ్లు తప్ప ఏం వచ్చాయి? ఇప్పుడు జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ఓట్ల యుద్ధంగా మార్చండన్నారు. మన రక్తం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకున్ని దించేస్తామని దీక్ష తీసుకోండని, ప్రజలకు ఓటు అనే శక్తి ఉంది. ఓటుతోనే గద్దె దింపాలన్నారు.
షర్మిల తెలంగాణ నాడి పట్టుకుంది. మొదటి నుంచి సరైన నిర్ణయాలు తీసుకుందని, గ్రామాల్లో షర్మిల ఉద్యమం ప్రారంభించాలి. ఏ ప్రాంతంలో పోరాటం చేసినా నేను పాట పాడతా.. కిలో మీటర్ వరకూ నడిచైనా పోరాటంలో భాగమవుతానని గద్దర్ పేర్కొన్నారు.  పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలని, రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగుతుందా? అన్నారు. ప్రత్యేక తెలంగాణ వచ్చింది కానీ ప్రత్యేక గ్రామ తెలంగాణ రాలేదన్నారు. ప్రత్యేక గ్రామ తెలంగాణ తీసుకొచ్చే బాధ్యత షర్మిల మీద ఉందని, పార్టీ కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లాలి. కేసీఆర్ రాజకీయంగా పతనమయ్యే దశ వచ్చిందని గద్దర్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్