ఛత్తీస్‌గఢ్ లో ఈ రోజు నక్సల్స్ జరిపిన దాడిలో పది మంది జవాన్లు చనిపోయారు. దంతే వాడ జిల్లాలో ఈరోజు ఉదయం దుర్ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని అరణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో నక్సల్స్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) పేల్చటంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ఐఈడి పేలుడు కోసం నక్సల్స్ ఓ గూడ్స్ వ్యాన్ వాడారు. జిల్లా రిజర్వ్ దళాలకు చెందిన జవాన్లు కూంబింగ్ కోసం వెళుతుండగా మావోయిస్టులు దాడికి తెగబడ్డారు.
నక్సల్స్ దాడిపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భుపేష్ భాఘెల్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మావోయిస్టులను ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పోరాటం చివరి దశలో ఉందని నక్సల్స్ ఓటమి అంచులలో ఉన్నారని సిఎం అన్నారు. కాగా దాడిలో ఎంత మంది గాయ పడింది తెలియరాలేదు. ఘటన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న సిఆర్ పిఎఫ్ బలగాలు నక్సల్స్ కోసం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.