Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్IPL: బెంగుళూరు పై  కోల్ కతా విజయం

IPL: బెంగుళూరు పై  కోల్ కతా విజయం

ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై కోల్ కతా నైట్ రైడర్స్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా 200 పరుగులు చేయగా లక్ష్య సాధనలో బెంగుళూరు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులే చేసింది. కోల్ కతా ప్లేయర్లలో  జేసన్ రాయ్, నితీష్ రానా, వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్ లోనూ…. వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రస్సెల్, సుయాష్ శర్మ బౌలింగ్ లోనూ రాణించారు.

బెంగుళూరు చిన్న స్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కోల్ కతా ఓపెనర్లు తొలి వికెట్ కు 83 పరుగులతో గట్టి పునాది వేశారు. జగదీషన్ నెమ్మదిగా ఆడి 29 బంతుల్లో 27 పరుగులు చేసి అవుట్ కాగా ఆ కాసేపటికే మరో ఓపెనర్  జేసన్ రాయ్-56 (29బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా వెనుదిరిగాడు. వెంకటేష్ అయ్యర్ 31రన్స్ సాధించగా, కెప్టెన్ నితీష్ రాణా 21 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు చేసి అవుట్ కాగా, ఆండ్రీ రస్సెల్ (1) మరోసారి విఫలమయ్యాడు.  తర్వాత  రింకూ సింగ్ 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ తో 18; డేవిడ్ వీస్ 3 బంతుల్లో రెండు సిక్సర్లతో 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీనితో నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200పరుగులు చేసింది.  బెంగుళూరు బౌలర్లలో హసరంగ, విజయ్ కుమార్ చెరో రెండు; సిరాజ్ ఓ వికెట్ పడగొట్టారు.

బెంగుళూరు లో కెప్టెన్ విరాట్ కోహ్లీ-54; మహిపాల్ లామ్రోర్-34;  దినేష్ కార్తీక్-22; డూప్లెసిస్-17 పరుగులు చేశారు. కోల్ కతా బౌలర్లో వరుణ్ చక్రవర్తి 3; సుయాష్ శర్మ, ఆండ్రీ రస్సెల్ చెరో రెండు వికెట్లు సాధించారు.

వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్