Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్IPL: బెంగుళూరు బౌలింగ్ కు లక్నో చిత్తు

IPL: బెంగుళూరు బౌలింగ్ కు లక్నో చిత్తు

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మరోసారి తన సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్ చేసి 126 పరుగులే చేసిన ఆ జట్టు ఈ స్వల్ప స్కోరును కాపాడుకొని ప్రత్యర్థి లక్నో సూపర్ జెయింట్స్ ను 108 పరుగులకే ఆలౌట్ చేసింది. బెంగుళూరు బౌలర్లు సమిష్టిగా, కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి జట్టుకు గొప్ప విజయం అందించారు.

లక్నో వాజ్ పేయి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో బెంగుళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు 62 పరుగులు చేసింది. ఆరంభం బాగానే ఉన్నా మొదటి వికెట్ తర్వాత వెంట వెంట వికెట్లు సమర్పించుకుంది. విరాట్ కోహ్లీ-31; కెప్టెన్ డూప్లెసిస్-44; దినేష్ కార్తీక్-14 మినహా మిలిగిలిన బ్యాట్స్ మెన్ అంతా విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3; అమిత్ మిశ్రా, రవి బిష్ణోయ్ చెరో 2; కృష్ణప్ప గౌతమ్ ఒక వికెట్ పడగొట్టారు.

పరుగుల ఖాతా తెరవకముందే లక్నో  ఓపెనర్ కేల్ మేయర్స్ వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా 14 రన్స్ చేసి రెండో వికెట్ (18 పరుగుల వద్ద)గా వెనుదిరిగాడు. ఆ వెంటనే కెప్టెన్ కెఎల్ రాహుల్ బదులు ఓపెనర్ గా వచ్చిన ఆయూష్ బదోనీ కూడా పెవిలియన్ చేరాడు. కృష్ణప్ప గౌతమ్-23; అమిత్ మిశ్రా-19; నవీల్ ఉల్ హక్-13  పరుగులు చేశారు. కెఎల్ రాహుల్ చివరిగా బరిలోకి వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. బెంగుళూరు బౌలర్లలో కర్ణ శర్మ, హాజేల్ వుడ్ చెరో 2;  సిరాజ్, మాక్స్ వెల్, హసరంగా, హర్షల్  పటేల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

డూప్లెసిస్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్