Sunday, November 24, 2024
HomeTrending Newsరాష్ట్రానికే కిరీటం భోగాపురం ఎయిర్ పోర్ట్: సిఎం జగన్

రాష్ట్రానికే కిరీటం భోగాపురం ఎయిర్ పోర్ట్: సిఎం జగన్

ఉత్తరాంధ్రకు, రాష్ట్ర వైభవానికి భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కేంద్ర బిందువుగా నిలవబోతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంలకు సమాన దూరంలో ఈ ఎయిర్‌పోర్టు ఉందని,  ఈ అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్రానికే ఓ కిరీటం కాబోతోందని అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం ప్రసంగించారు. విజయనగరం జిల్లాలోని  49 గ్రామాలకు, విజయనగరం పట్టణానికి, భోగాపురం ఎయిర్‌పోర్టుకు తాగునీటిని… 30 వేల ఎకరాలకు సాగునీరు అందించే తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్టును మరింతముందుకు తీసుకెళ్లేలా రూ.190 కోట్ల పనులకు శ్రీకారం చుడుతున్నామని, 2024 డిసెంబర్‌ నాటికి  దీన్ని పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.

సిఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

  • దేవుడి ఆశీస్సులు కూడా ఈరోజు మెరుగ్గా ఉన్నాయి, మంచి వర్షంతో ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తున్నాడు
  • మూడు మంచి కార్యక్రమాలు ఎయిర్‌పోర్టు, ఫిష్‌ల్యాండ్ సెంటర్‌, డేటా సెంటర్ల పనులకు శంకుస్థాపన
  • ఇవి ఉత్తరాంధ్ర చరిత్రను రాబోయే రోజుల్లో మారుస్తాయి, నాలుగు సంవత్సరాల పరిపాలనలో ప్రతి ప్రాంతం బాగుపడాలని అడుగులు వేస్తూ వచ్చాం
  • సంస్కృతికి, సాంప్రదాయానికి, కవిత్వానికి, వాడుక భాష ఉద్యమానికి చిరునామా ఈ గడ్డ
  • కళింగాంధ్ర భావాల విప్లవానికి గజ్జెకట్టిన నేల ఇది, అభ్యుదయానికి చిరునామా ఈ ప్రాంతం… ఇక మీద అభివృద్ధికి కూడా రాబోయే రోజుల్లో చిరునామా నిలుస్తుంది
  • మన అందరి ప్రభుత్వం ఉత్తరాంధ్రను బాగుచేయాలని మనాసా, వాచా, కర్మేణా గట్టిగా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది
  • ఈ మధ్యనే  మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశాం: ఉత్తరాంధ్ర సహా శ్రీకాకుళం ప్రజల తలరాతలను మార్చే పోర్టు ఇది, గతంలో ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు
  • మరో 24 నెలల్లో షిప్పుల నుంచి కార్గో రవాణా జరుగుతుంది, ఉత్తరాంధ్రకు ఈ  పోర్టు మణిహారం
  • చింతపల్లిలో 24 కోట్లతో ఫిష్‌ల్యాండ్‌ సెంటర్లకు కూడా శంకుస్థాపన చేస్తున్నాం
  • విశాఖలో అదానీ డేటాసెంటర్లకూ కూడా ఇవాలే శంకుస్థాపన

  • విశాఖపట్నంకు వచ్చే సబ్‌మెరైన్‌ కేబుల్‌ కనెక్టివిటీ వల్ల మన రాష్ట్ర ఐటీ చిత్రం కూడా మారుతుంది.
  • ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలు పోయే శ్రమీజీవులుగా ఉండేది
  • రాబోయే రోజుల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకోసం ఈ ప్రాంతానికి వచ్చే వలసలు వచ్చే  పరిస్థితులు వస్తాయి:జాబ్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర మారబోతోంది
  • ఒకవైపును శ్రీకాకుళంలో పోర్టు, మరోవైపున ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు.. ఇవన్నీ ఉత్తరాంధ్ర రూపురేఖలు మారుస్తాయి
  • టూరిజం, మెడికల్‌ టూరిజం, ఐటీ ప్రగతికి ఈ ఎయిర్‌పోర్టు కేంద్రబిందువుగా మారుతుంది
  • భూమి పూజ చేసిన ఎయిర్‌పోర్టు మూడేళ్లలో పూర్తవుతుంది
  • 2025 నాటికి భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది
  • మళ్లీ మీ బిడ్డే… మీ అన్నే.. మీ తమ్ముడే.. వచ్చి ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తాడు
  • దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ఎవరెన్ని కుట్రలు పన్నినా ఏమీ చేయలేరు
  • కొంతమంది ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన అంటే.. విమర్శలు చేస్తున్నారు:
  • మరి గత ప్రభుత్వం హయాంలో అంతా సవ్యంగా ఎంటే.. ఎందుకు మందుకు సాగలేదు?
  • సుప్రీంకోర్టులో కేసులు, హైకోర్టులో కేసులు, ఎన్జీటీలో కేసులు.. ఇలా అనేక కేసులను పరిష్కరించుకుంటూ వచ్చాం
  • భూ సేకరణ కూడా పూర్తిచేయగలిగాం: కేంద్ర నుంచి అన్ని అనుమతులూ తీసుకురాగలిగాం
  • టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి.. నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాం
  • గతంలో ఇవేమీ చేయకుండా ఎన్నికలకు కేవలం 2-3 నెలల ముందు టెంకాయ కొట్టడం,  పోవడం చేశారు
  • కాని ఏమాత్రం సిగ్గు లేకుండా… గతంలోనే శంకుస్థాపన చేశామని చెప్పుకుంటున్నారు
  • ఇంతకన్నా.. .దారుణమైన పరిస్థితి రాజకీయాల్లో ఉండదు

  • విశాఖ నుంచి భోగాపురం వచ్చేందుకు రూ.6300 కోట్లతో నాలుగు నెలల్లో రోడ్డు నిర్మాణ పనులకు త్వరలో శంకుస్థాపన
  • దీనిపై కేంద్రమంత్రి గడ్కరీ మాట్లాడాం:,  ఆయన ఆశీస్సులతో ఈప్రాజెక్టు కూడా ప్రారంభం అవుతుంది
  • ఈ ప్రాజెక్టుల వల్ల లక్షలమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు రాబోతున్నాయి
  • జీఎమ్మార్‌ ఈ ప్రాంతం వాసి, భోగాపురం ఎయిర్ పోర్ట్ ను 36 నెలల్లోనే కాకుండా.. ఇంకా ముందే పూర్తి చేయాలని అడిగాం
  • శాయశక్తులా కృషిచేస్తామని చెప్పారు:  30 నెలల్లో పూర్తిచేయడానికి అన్నిరకాలుగా ప్రయత్నిస్తానన్నారు.
  • దేవుడి ఆశీస్సులతో 30 నెలల్లోపే విమానాలు తిరగడం ప్రారంభమవుతాయి
  • అనుమతులు మంజూరుచేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర పౌరవిమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింథియాకు ధన్యవాదాలు
  • భూములు ఇచ్చిన రైతన్నలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా
  • ఇప్పటికే నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలను పునరావాస గ్రామాలకు తరలించాం
  • రెండు గేటెట్‌ కమ్యూనిటీ తరహాలో వారికి ఇళ్లు నిర్మించడం జరిగింది,  ప్రజలందరకూ అక్కడకు వెళ్లారు
  • పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా రాజధానుల స్థాయికి కూడా తీసుకెళ్లడం మన అందరి ప్రభుత్వ విధానం
  • రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖపట్నం
  •  ఈ సెప్టెంబరు నుంచి మీ బిడ్డ విశాఖలోనే కాపురం ఉంటాడని చెప్తున్నాను
  • వివక్ష లేకుండా, కులం చూడకుండా, పార్టీలు చూడకుండా, పార్టీలు చూడకుండా.. మన ప్రభుత్వం అడుగులు వేస్తోంది
  • దేశ చరిత్రలో ఎక్కడా చూడని విధంగా ఈ 47 నెలల కాలంలో 2.10 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ చేశాం
  • గతానికి, ఇప్పటికీ తేడాను గమనించమని కోరుతున్నాం
  • గతంలో తెలుగుదేశం పార్టీకి ఓటువేసిన వారిని కూడా వారి గడప వద్దకు వచ్చి ఆప్యాయంగా  అడగగలను
  • చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కంటే… మన అందరి ప్రభుత్వంలో మంచి జరిగిందని భావిస్తేనే మాకు ఓటు వేయండని నిజాయితీతో, చిత్త శుద్ధితో అడగగలుగుతున్నాను
RELATED ARTICLES

Most Popular

న్యూస్