యూరోప్ ఖండంలోని సెర్బియా దేశంలో అంతర్గత కుమ్ములాటలు తగ్గి ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో సాగుతోంది. ఈ తరుణంలో దేశంలో వరుస కాల్పుల ఘటనలు ప్రజలను భయాన్దోలనకు గురిచేస్తోంది. తాజాగా సెర్బియాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రాజధాని బెల్‌గ్రెడ్‌కు సమీపంలోని మ్లడొనోవాక్‌లో దుండగుడు ఆటోమెటిక్ వెపన్‌తో కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఎనిమిది మంది మృతిచెందగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం సాయంత్రం కదులుతున్న వాహనంలో నుంచి ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడని, అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడని స్థానిక మీడియా వెల్లడించింది. నిందితుడి కోసం పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారని, పెద్ద ఎత్తున బలగాలను మోహరించారని పేర్కొన్నది. కాగా, సెర్బియాలో కాల్పుల ఘటన గత రెండు రోజుల్లో ఇది రెండోసారి.
Serbia: సెర్బియాలో మరోసారి కాల్పులు…8 మంది మృతి
బుధవారం సెంట్రల్ బెల్‌గ్రేడ్‌లో ఉన్న వ్లాదిస్లావ్ రిబ్నికర్ స్కూల్‌లో 14 ఏండ్ల బాలుడు కాల్పులు జరిపాడు. దీంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 8 మంది విద్యార్థులు కాగా, మరొకరు స్కూల్‌లో గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి ఉన్నాడు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం తన తండ్రి తుపాకీని తీసుకుని స్కూల్‌కు వెళ్లిన బాలుడు.. తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మరో ఆరుగురు విద్యార్థులు, ఒక టీచర్ గాయపడ్డారు.