Sunday, September 22, 2024
HomeTrending NewsCocaine: సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం

Cocaine: సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఈ రోజు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు నైజీరియన్‌తో పాటు ఐదుగురిని సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి నైజీరియన్‌కు చెందిన డ్రగ్స్ కింగ్ పిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చింతా రాకేష్ ఈ ముఠా కి కింగ్ పిన్. గోవా నుంచి కొకైన్ తెచ్చి ఇక్కడ సప్లై చేస్తున్నాడు. డ్రై ఫ్రూట్ బిజినెస్ లో లాస్ రావడంతో.. డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు. గోవాలో 7 వేలకు గ్రామ్ కొని… హైదరాబాద్ లో 18 వేలకు అమ్ముతున్నాడు.

ఈ సందర్భంగా కోట్ల రూపాయల కొకైన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ముఠా విదేశాల నుంచి కొకైన్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రెండు కార్లు, 5 సెల్ ఫోన్స్ సీజ్ చేశామని, A4 సూర్య ప్రకాష్ ని పట్టుకోవడంతో ఈ ముఠా గురించి బయటపడిందని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. వాట్సాప్ ద్వారా కస్టమర్లను ఈ ముఠా సంప్రదిస్తుందని, హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీలు హోస్ట్ చేసి…కంజ్యుమర్స్ ని పిలిచి అక్కడ డ్రగ్స్ సప్లై చేస్తున్నారన్నారు. నిందితుల వాట్సాప్ చాట్ లో కొంతమంది ప్రముఖ వ్యారవేత్తలు కూడా ఉన్నారని, కస్టమర్స్ ఎవరో గుర్తించే పనిలో ఉన్నాం… వారికి నోటీసులు ఇస్తామని తెలిపారు. NDPS యాక్ట్ సెక్షన్ 27 ప్రకారం కష్టమర్స్ కి నోటీసులు ఇస్తామని సిపి ప్రకటించాటు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్