Wednesday, November 27, 2024
HomeTrending NewsAmara Raja: అమర రాజా లిథియం ఫ్యాక్టరీకి భూమి పూజ

Amara Raja: అమర రాజా లిథియం ఫ్యాక్టరీకి భూమి పూజ

తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు మూడు లక్షలకు పైగా ఉద్యోగులు ఐటి పరిశ్రమ లో పనిచేస్తుంటే ఈరోజు పది లక్షల మంది పనిచేస్తున్నారని మంత్రి కేటిఆర్ వెల్లడించారు. నేరుగా కాకుండా పరోక్షంగా కూడా లక్షలాది ఉద్యోగాలు ఐటీ పరిశ్రమ కల్పించిందన్నారు. అమర రాజా గిగా కారిడార్ ఫర్ లిథియం అయాన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు… మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇతర ప్రజాప్రతినిధులు ఈ రోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం ఉద్యమం జరిగిన రోజు ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉంటామని చెప్పాం… ఆరోజు చెప్పినదే ఈరోజు నిజమైంది. ప్రాంతాలుగా విడిపోయి వేరువేరుగా, అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయి రెండు రాష్ట్రాలన్నారు.

కేటిఆర్ కామెంట్స్ ….
ఏ పరిశ్రమ వచ్చిన, మా పరిశ్రమల శాఖ బృందం కృషి ప్రతి పెట్టుబడి వెనక ఉంటుంది. దేశ విదేశాలతో పోటీపడి పైసా లంచం లేకుండా.. పారదర్శకంగా పరిశ్రమలు తెలంగాణకు తీసుకురావాలంటే ఎంతో సవాల్ తో కూడుకుని ఉంటుంది. ఈరోజు ఇక్కడ అమర్ రాజా బ్యాటరీ ప్లాంట్  రాక ముందు దేశంలోని 8 రాష్ట్రాలు దీని కోసం పోటీపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం సరిగా సహకరించుకుంటే మా రాష్ట్రానికి రండి అని ఈ కంపెనీని బ్రతిమిలాడారు… కానీ తెలంగాణ రాష్ట్రం స్పందించిన తీరు ఇచ్చిన… సహకారంతో అమర్ రాజా ఈరోజు మహబూబ్నగర్లో దేశంలోనే అతిపెద్ద గీగా ఫ్యాక్టరీని ప్రారంభించుకుంటున్నది.

ఈరోజు అమర రాజా పరిశ్రమ మహబూబ్నగర్ రావడం వలన పదివేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన పరిశ్రమ సాదాసీదా పరిశ్రమ కాదు.. 10 సంవత్సరాలలో 9500 కోట్ల రూపాయలను ఇక్కడ పెట్టుబడిగా పెట్టబోతున్నారు. అమర్ రాజా సంస్థ 37 సంవత్సరాల ప్రస్థానంలో పెట్టిన మొత్తం పెట్టుబడికి రెట్టింపు ఇక్కడ ఒక్క మహబూబ్నగర్ ప్లాంట్ లోనే పెడుతుంది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని మనపై నమ్మకంతో వచ్చిన కంపెనీ యాజమాన్యానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నా.

కొంతమంది అభివృద్ధి నిరోధకులు, ప్రగతి నిరోధకులు మన ప్రయత్నాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ పెట్టబోతున్న బ్యాటరీ ప్లాంట్… కాలుష్య పూరిత సాంప్రదాయ ప్లాంట్ కాదు… ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన లీథియం అయాన్ బ్యాటరీలను తయారు చేసే కాలుష్య రహిత ప్లాంట్. ఒక్క చుక్క కాలుష్యం బయటకు రాకుండా జీరో లిక్విడ్ వేస్ట్ పద్దతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్లాంట్ ఏర్పాటు కాబోతుంది. అమర రాజా బ్యాటరీలు తయారు చేస్తున్న ఇతర ప్రాంతాల్లో కూడా కాలుష్య రహిత పరిసరాలను కలిగి ఉంది… అవసరమైతే ఆయా ప్లాంట్లను సందర్శించేలా… అనుమానం వ్యక్తం చేసిన వాళ్లను తీసుకువెళ్లాలి. ఇక్కడ పెట్టబోయే ప్లాంట్ పరిమాణాన్ని అర్థం చేసుకోవాలంటే… 16 గిగ వాట్ ఆవర్ల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నది…. ఒక్క గిగా వాట్ అవర్ తో ఐదు లక్షల టూవీలర్లకు బ్యాటరీలు అందించవచ్చు… మరి 16గీగా వాట్ అవర్ల సామర్థ్యం అంటే ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలి.

ఇంత పెద్ద ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు… కంపెనీ యాజమాన్యం దీనికి అంగీకరించి పక్కనే నిర్మించిన నూతన ఐటీ టవర్లో స్థానికులకు శిక్షణ కార్యక్రమాలను ఇప్పటి నుంచి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్