వృద్ధిమాన్ సాహా – శుభ్ మన్ గిల్ చెలరేగి ఆడడంతో నేడు జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 56 పరుగులతో లక్నో సూపర్ జెయింట్స్ పై ఘన విజయం సాధించినింది. అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ ఓపెనర్లు సహా-గిల్ తొలి వికెట్ కు 142 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. సాహ 43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 81; ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 15 బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లతో 25 పరుగులు చేసి ఔటయ్యారు. శుభ్ మన్ గిల్ 51 బంతులో 2ఫోర్లు, 7 సిక్సర్లతో 94; డేవిడ్ మిల్లర్ 24 పరుగులతో నాటౌట్ గా నిలిచారు, 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. లక్నో బౌలర్లు మోసిన్ ఖాన్, అవేష్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.
లక్ష్య సాధనలో లక్నో ఆరంభం బాగానే ఉంది. తొలి వికెట్ కు 88 పరుగులు చేసింది. కేల్ మేయర్స్ 32బంతుల్లో 7 ఫోర్లు, 2సిక్సర్లతో 48; క్వింటన్ డికాక్ 41బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. 20 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లో మోహిత్ శర్మ 4; షమీ, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
శుభ్ మన్ గిల్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.