స్వచ్ఛంధ దివాళాకు గోఫస్ట్ కంపెనీ దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ అంశంలో గోఫస్ట్‌కు భారీ ఊరట దక్కింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) ఆ పిటీషన్‌ను ఆమోదించింది. దీంతో ఆ కంపెనీకి చెందిన అసెట్స్, లీజులకు రక్షణ దొరికింది. జస్టిస్ రామలింగం సుధాకర్, ఎల్ఎన్ గుప్తాలతో కూడిన ఎన్సీఎల్టీ బెంచ్ ఈ కేసులో ఆదేశాలు జారీ చేసింది. కార్పొరేట్ ఇన్సాల్వెన్సి రిజల్యూషన్ ప్రాసెస్(సీఐఆర్పీ) కింద ప్రక్రియ మొదలు పెట్టవచ్చు అని బెంచ్ తెలిపింది.
Go First: గోఫస్ట్ కు లైన్ క్లియర్
ఎయిర్‌లైన్స్ సంస్థ సజావుగా నడిచేందుకు అభిలేశ్ లాల్‌ను తాత్కాలిక పరిష్కర్తగా నియమించింది. ఐఆర్పీ వద్ద అయిదు కోట్లు డిపాజిట్ చేయాలని గోఫస్ట్ మేనేజ్మెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు. అయితే కోర్టులో కేసు కొనసాగుతున్నంత కాలం సంస్థలో ఉద్యోగుల్ని తొలగించరాదు అని ఆదేశించారు. ఇక మే 19వ తేదీ వరకు విమానాలను సస్పెండ్ చేస్తున్నట్లు గోఫస్ట్ సంస్థ ప్రకటించింది.