జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, కడియం ఆవలో పంటలు దెబ్బ తిన్న రైతాంగాన్ని పరామర్శించి, మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అంతకుముందు రాజమండ్రి విమానాశ్రయంలో పవన్ కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పవన్ వెంట ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ప్రభుత్వం ముందే ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఈ నష్టం వాటిల్లేది కాదని రైతులు పవన్ కు ఫిర్యాదు చేశారు. ఈరోజు జనసేన అధినేత పర్యటన ఉండడంతో హడావుడిగా నిన్న సాయంత్రం కళ్ళేల వద్దనుంచి ధాన్యాన్ని తరలించారని రైతులు ఆరోపించారు.
ఇక్కడినుంచి వేమగిరి, జొన్నాడ, రావులపాలెం, కొత్తపేట మీదుగా అవిడి చేరుకొని నష్టపోయిన రైతులతో మాట్లాడతారు.తదుపరి పి. గన్నవరం నియోజకవర్గం రాజుపాలెం లో కూడా పర్యటిస్తారు. ఈ రాత్రికి రాజమండ్రి నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.