Sunday, November 24, 2024
HomeTrending NewsBypoll: జలంధర్‌ లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం

Bypoll: జలంధర్‌ లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం

కాంగ్రెస్‌ పార్టీ కంచుకోటను ఆమ్‌ ఆద్మీ పార్టీ బద్దలు కొట్టింది. పంజాబ్‌ రాష్ట్రంలోని జలంధర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆ పార్టీ భారీ విజయం సాధించింది. సుమారు 24 ఏళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీకి పట్టు ఉన్న జలంధర్‌లో.. తాజాగా జరిగిన ఉప ఎన్నికలో ఆప్‌ అభ్యర్థి భారీ మెజారిటీతో విజయం సాధించారు.

ఆప్‌ అభ్యర్థి సుశీల్‌ కుమార్‌ రింకూ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి అయిన కరమ్‌ జీత్‌ కౌర్‌ పై 58 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రింకూకు 3,02,097ఓట్లు పోలవగా.. కాంగ్రెస్ అభ్యర్థికి 2,43,450 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత శిరోమణి అకాలీదళ్‌ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి 1,58,354 ఓట్లతో మూడో స్థానంలో నిలవగా.. 1,34,706 ఓట్లతో బీజేపీ అభ్యర్థి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు.

జలంధర్‌ ఎంపీ సంతోక్‌ సింగ్‌ ఛౌదరి గుండెపోటుతో హఠాన్మరణం పాలవడంతో ఆ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. గత జనవరిలో రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర సందర్భంగా సంతోక్‌ సింగ్‌ గుండెపోటుతో మృతిచెందారు. ఈ నెల 10వ తేదీన జలంధర్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.

మరోవైపు ఒడిశాలోని ఝార్సుగూడ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. బీజేడీ అభ్యర్థి దీపాలీ దాస్‌ చేతిలో బీజేపీ అభ్యర్థి తన్కదార్‌ త్రిపాఠీ 48 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీపాలీ దాస్‌ తండ్రి నబా కిషోర్‌ దాస్‌ ఈ ఏడాది జనవరిలో ఓ పోలీస్‌ ఆఫీసర్‌ జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. దాంతో ఝార్సుగూడ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్