Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్IPL: సిమ్రాన్ సెంచరీ: పంజాబ్ ఆశలు సజీవం

IPL: సిమ్రాన్ సెంచరీ: పంజాబ్ ఆశలు సజీవం

పంజాబ్ ఓపెనర్ సిమ్రాన్ సింగ్ (108) సెంచరీతో చెలరేగి తమ జట్టు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచాడు. దీనితో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 31 పరుగులతో విజయం సాధించింది. సొంత మైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ 10 పరుగులకే  తొలి వికెట్ (కెప్టెన్ శిఖర్ ధావన్-7) కోల్పోయింది. లియామ్ లివింగ్ స్టోన్, జితేష్ శర్మ కూడా విఫలమయ్యారు. సహచరులంతా ఔటవుతున్నా సిమ్రాన్ క్రీజులో నిలదొక్కుకొని 65 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 పరుగులు చేసి ఆరో వికెట్ గా వెనుదిరిగాడు. మిగిలిన వారిలో శామ్ కర్రన్-20; సికిందర్ రాజా-11 ఇద్దరే రెండంకెల స్కోరు దాటారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ2;  అక్షర్ పటేల్, ప్రవీణ్ దుబే, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఢిల్లీ తొలి వికెట్ కు 61 పరుగులు జోడించి పటిష్టంగా ఉన్నట్లు కనబడినా… ఫిల్ సాల్ట్ 21 పరుగులు చేసి తొలి వికెట్ గా వెనుదిరిగాడు, అనంతరం వరుస వికెట్లు సమర్పించుకుంది. మరో ఓపెనర్, కెప్టెన్ డేవిడ్ వార్నర్ 27 బంతుల్లో 10 ఫోర్లు, ­1 సిక్సర్ తో 54 పరుగులు చేసి నాలుగో వికెట్ గా ఔటయ్యాడు, మిచెల్ మార్ష్(3), రీలీ రోస్సో(5), అక్షర్ పటేల్(1), మనీష్ పాండే (0) విఫలమయ్యారు. అమన్ ఖాన్-16; ప్రవీణ్ దుబే-16; కుల్దీప్ యాదవ్-10 పరుగులు చేశారు, 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో హర్ ప్రీత్ బ్రార్ 4; నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

సెంచరీ సాధించిన సిమ్రాన్ సింగ్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

ఈ పరాజయంతో ఢిల్లీ ప్లే ఆఫ్ ఆశలు ఆవిరయ్యాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్