అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వానికైనా ఉపాధి కల్పన, సంపద సృష్టి అత్యంత సవాళ్లతో కూడుకున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఈ రెండు అంశాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. హైదరాబాద్లోని కొంగరకలాన్ లో Foxconn ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి ఈ రోజు జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, Foxconn interconnect technology చైర్మన్ అండ్ సీఈవో సిడ్నీ లూ, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ ప్రసంగంలోని ముఖ్య అంశాలు
• ఫాక్స్ కాన్ కంపెనీ తో తెలంగాణలో పెట్టుబడి పెట్టించేందుకు మార్చి రెండవ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. సరిగ్గా రెండున్నర నెలల తర్వాత ఈరోజు ఆ ప్లాంట్ కు భూమి పూజ నిర్వహించుకున్నాం.
• ఫాక్స్ కాన్ కంపెనీ దేశంలోని పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కానీ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాల్లో ఉన్నంత వేగం, పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించాలన్న నిబద్ధత ఇంకెక్కడ చూడలేదని మీడియా సాక్షిగా ఫాక్స్ కాన్ ప్రతినిధి బృందం చెప్పడం గర్వకారణం.
• అభివృద్ధి చెందిన దేశమైనా, వెనుకబడిన దేశమైనా ప్రజలందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం అసాధ్యం. అందుకే ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించడం లేదా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది.
• గత తొమ్మిది సంవత్సరాలుగా దేశ విదేశాలకు తిరిగి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చి లక్షలాది ఉద్యోగాలు కల్పించినం.
• ఫాక్స్ కాన్ కంపెనీ రావడంతో 35 నుంచి 40 వేల ఉద్యోగాలు వస్తాయి. మొత్తంగా లక్ష మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది.
• రానున్న తొమ్మిది నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఫాక్స్ కాన్ హామీ ఇచ్చింది.
• ఇందులోని ఉద్యోగాలు స్థానికులకే దక్కాలన్న ఉద్దేశంతో ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ,ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకొని వెంటనే ప్రారంభమయ్యేలా చూడాలి.
• రాష్ట్రంలో సంపద సృష్టికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు తెలంగాణ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున కృషి చేస్తుంటే ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీలు మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి.
• రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేని దౌర్భాగ్యపు ప్రతిపక్షాలు కేవలం తెలంగాణలోనే ఉన్నాయి.
• యువకుల పొట్ట కొట్టి పేపర్లు లీక్ చేసి ఒక పార్టీ నిరుద్యోగ మార్చ్ అంటుంది.
• దశాబ్దాల పాటు అన్ని రంగాల్లో విఫలమైన మరొక పార్టీ ఇప్పుడొక ఛాన్స్ కావాలి అని అడుగుతుంది.
• మా ప్రభుత్వం అన్ని రంగాలను, అన్ని వర్గాలను కలుపుకొని సంక్షేమమే ఎజెండాగా ముందుకు పోతున్నది. జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నది.
•అందరకీ తాగడానికి మంచినీళ్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది మాదే. 65 లక్షల మందికి రైతుబంధు ఇచ్చిన ప్రభుత్వం మాది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక పథకాలకు తెలంగాణనే స్పూర్తి.
• ఈరోజు తెలంగాణలో పట్టణాలు పల్లెలు బాగున్నాయి. మూడు శాతం జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం 30 శాతం జాతీయ అవార్డులను గెలుచుకుంది.
• వ్యవసాయం నుంచి ఐటీ దాకా అన్ని రంగాల్లో అగ్ర పథాన దూసుకుపోతున్నది.
• రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావస్తున్నది. దశాబ్దాల పాటు ప్రాజెక్టు కట్టకుండా సతాయించి నీళ్లు ఇవ్వని పార్టీలు, ఉద్యోగాలు ఇవ్వని పార్టీలు ఇవాళ అవకాశం కోసం అడుగుతున్నాయి.
• రాష్ట్ర ప్రజలకు తాగునీరు ఇచ్చిన కేసీఆర్ మాత్రమే సాగునీరు కూడా ఇస్తారని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు
• మూడు నాలుగు సంవత్సరాలలో కొంగరకలాన్, మహేశ్వరం ప్రాంతాలు సమూలంగా మారాయి. ప్రగతి బాట పట్టాయి.
• రజనీకాంత్ లాంటి వ్యక్తులు హైదరాబాద్ న్యూయార్క్ నగరంలా మారిందని ఊరికే అనలేదు. నగరం అద్భుతంగా డెవలప్ అయింది. కాబట్టి ఇన్ని ప్రశంసలు దక్కుతున్నాయి.
•దశాబ్దాలపాటు సంపూర్ణంగా అన్ని రంగాల్లో విపులమైన పార్టీ ఈరోజు మరొకసారి అవకాశం అడుగుతున్నది.
• 18 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి మోడీ మోసం చేసిన తర్వాత కూడా బిజెపి నిరుద్యోగ మార్చ్ పేరుతో తిరుగుతున్నది. మోడీ 18 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఈరోజు నిరుద్యోగ మార్చ్ అవసరం లేదు. దమ్ముంటే నిరుద్యోగ మార్చ్ మోడీ పైన చేయాలి. పేపర్లు లీక్ చేసి విద్యార్థి యువతను ఇబ్బందుల పాలు చేసిన పార్టీ బిజెపి
• ఈరోజు రాష్ట్రానికి ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి అంటే రెండే కారణాలు. ఒకటి సుస్థిరమైన ప్రభుత్వం మరొకటి సమర్థవంతమైన నాయకత్వం.
• అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించాలి.
• మామూలు విజయంతో కాకుండా ఢంకా బజాయించి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకి 100 సీట్లతో ప్రజామోదం ఇవ్వాలి.