న్యూఢిల్లీలో మే 27 వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఏయే అంశాలు లేవనెత్తాలనే దానిపై సిఎం అధికారులతో కూలంకషంగా చర్చించారు.
సీఎస్ డాక్టర్ కే ఎస్ జవహర్ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మీ, వ్యవసాయ, సహకార శాఖల స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం టి కృష్ణబాబు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె శ్యామలరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి కోటేశ్వరరావు, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్ కుమార్, ఐటీశాఖ కార్యదర్శి కోన శశిధర్, వైద్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ జె నివాస్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ డాక్టర్ వినోద్ కుమార్, సీసీఎల్‌ఏ సెక్రటరీ ఏఎండి ఇంతియాజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి విజయసునీత ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు.