Friday, November 22, 2024
HomeTrending NewsAmaravati: తుళ్లూరులో ఉద్రిక్తత:

Amaravati: తుళ్లూరులో ఉద్రిక్తత:

అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీ ర్యాలీలకు ర్యాలీలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతం తుళ్లూరులో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా తుళ్లూరు దీక్షా శిబిరంలో జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ నిరసన దీక్షకు పిలుపునిచ్చారు.

అంతకుముడే తెదేపా ఆధ్వర్యంలో రైతులు నిరసన దీక్ష చేపట్టారు. అప్పటికే దీక్షా శిబిరం వద్ద పోలీసులు వందల సంఖ్యలో మోహరించారు. ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదంటూ.. రైతులను పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్‌నూ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతియుతంగా దీక్ష చేపడుతుంటే అడ్డంకులేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అరెస్టు చేసిన రైతులు, మహిళలను బలవంతంగా వాహనాలు ఎక్కించి తుళ్లూరు పీఎస్‌కు తరలించారు..

దీక్షా శిబిరంలోకి ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. రోజువారీ నిరసనలకు కూడా అనుమతి లేదని పోలీసులు తేల్చి చెబుతున్నారు. ఎవరొచ్చినా సరే బలవంతంగా అరెస్టు చేస్తామని తేల్చి చెబుతున్నారు. మరోవైపు తుళ్లూరు మండలంలో తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్