రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు మాట్లాడడం టి ఆర్ యస్ పార్టీ దృక్పథం అని ఆయన స్పష్టం చేశారు. పబ్లిసిటీ కోసం రాజకీయాలు చేసుకుంటూ పోతే అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన తేల్చిచెప్పారు. 2014కు పూర్వం ఆరు దశాబ్దాలుగా జరిగింది అదే తంతు అని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఆహారభద్రత కార్డులను ఆయన ఈ రోజు నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో లబ్ధిదారులకు అందజేశారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడో ఒక కుగ్రామంలో పురుడు పోసుకున్న ఫ్లోరోసిస్ అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి నల్లగొండ జిల్లాను కబళించిందన్నారు. అటువంటి ఫ్లోరోసిస్ ను నిలువరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బృహత్తర కార్యక్రమం మిషన్ భగీరథ. ఈ పథకానికి శ్రీకారం చుట్టింది మునుగోడు నియోజకవర్గంలోనే అని ఆయన చెప్పారు. అటువంటి భగీరథ పథకం ద్వారా ఫ్లోరోసిస్ ను తరిమి కొట్టేందుకే కృష్ణా,గోదావరి జీవనదుల నుండి సురక్షితమైన తాగు నీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని కొనియాడారు. ఇది ప్రభుత్వంగా మేము చెబుతున్న మాటలు కాదని లోక్ సభలో బిజెపి కి చెందిన కేంద్ర జలశక్తి చైర్మన్ చెప్పిన మాటలు అని మంత్రి జగదీష్ రెడ్డి ఉటంకించారు. అసలు మిషన్ భగీరథ పథకానికి మూలమే మునుగోడు నియోజకవర్గమని, అధికారంలోకి వచ్చిందే తడవుగా ఇక్కడి ప్రజల గోసను దృష్టిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పధకానికి అంకురార్పణ చేశారని ఆయన తెలిపారు.
ప్రజల ఆకాంక్షలే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎజెండా అని చెప్పేందుకు ఈ ఒక్క పథకం సరిపోతుందని ఆయన అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల వద్ద నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్, మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మల్కాపురం వద్ద నిర్మిస్తున్న ఇండ్రస్ట్రియల్ పార్క్ లు టి.ఆర్.యస్ ప్రభుత్వంలో అభివృద్ధికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో టి ఆర్ యస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మీదటనే రాష్ట్రము సస్యశ్యామలంగా మారిందని, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరా గురించి యావత్ భారతదేశం అభినందిస్తుందన్నారు.రైతుబందు పథకం ఒక చారిత్రాత్మక నిర్ణయమన్నారు.అటువంటి సంక్షేమ పథకాలు చేపట్టి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ప్రపంచ చిత్ర పటం లో తెలంగాణ కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను తమ వాడిగా తెలంగాణ సమాజం బావిస్తున్నదన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జడ్ పి టి సి స్వరూప,యం పి పి స్వామి,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,అదనపు కలెక్టర్ చౌహన్,డి యస్ ఓ వెంకటేశ్వర్లు తదితరులు