Tuesday, April 15, 2025
HomeTrending Newsodisha: ఒడిశా రైలు ఘటనపై సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి

odisha: ఒడిశా రైలు ఘటనపై సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి

ఒడిషా రాష్ట్రం లోని బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో, కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.

ఇది అత్యంత దురదృష్టకర సంఘటన అని సీఎం విచారం వ్యక్తంచేశారు. ఈ ఘోర ప్రమాదంలో పలువురు మృత్యువాత పడడం, మరెందరో తీవ్ర గాయాల పాలు కావడం పట్ల సిఎం తన ఆవేదన వ్యక్తం చేశారు.

మరణించిన వారి కుటుంబాలకు సిఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తగు రీతిలో ఆదుకొని, వారికి భరోసాను కల్పించాలని సీఎం కేసిఆర్ కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్