సింగపూర్ ఓపెన్ లో తొలిరోజే ఇండియాకు నిరాశ ఎదురైంది. స్టార్ ఆటగాళ్ళు పివి సింధు, హెచ్ ఎస్ ప్రణయ్ నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్, ప్రియాన్షు రాజావత్…. డబుల్స్ లో ధృవ్-అర్జున్ జోడీ విజయం సాధించారు.
- కిడాంబి శ్రీకాంత్ 21-15;21-19 తేడాతో థాయ్ లాండ్ ప్లేయర్ కంటాఫోన్ ను ఓడించాడు.
- ధృవ్ కపిల- ఎమ్మార్ అర్జున్ జోడీ 21-16; 21-15 తో ఫ్రాన్స్ ద్వయం లుకాస్ కోర్వీ-రోనన్ లబర్ లపై విజయం సాధించారు.
- ప్రియాన్షు రాజావత్ 21-12; 21-15 తేడాతో జపాన్ ఆటగాడు కాంటాసునేయమ పై గెలుపొందాడు.
పురుషుల సింగిల్స్ లో
- హెచ్ ఎస్ ప్రణయ్ 15-21;19-21 తో జపాన్ కు చెందిన కొడాయ్ నరౌకా చేతిలో ఓడిపోయాడు.
- లక్ష్య సేన్ పై చైనీస్ తీపీ ప్లేయర్ చౌ టీన్ చెన్ 18-21; 21-17;21-13 తో విజయం సాధించాడు
మహిళల సింగిల్స్ లో….
- పివి సింధుపై జపాన్ ప్లేయర్ అకానే యమగుచి 18-21; 21-19, 21-17 తేడాతో విజయం సాధించింది. తొలి సెట్ గెల్చుకున్న సింధు ఆ తర్వాత ప్రత్యర్థి ధాటికి తలొగ్గింది.
- సైనా నెహ్వాల్ పై థాయ్ లాండ్ క్రీడాకారిణి రత్చనోక్ ఇంటానన్ 21-13; 21-15 తేడాతో
- ఆకర్షి కాశ్యప్ కూడా థాయ్ లాండ్ కే చెందిన సుపథ కతెతాంగ్ చేతిలో 21-17;21-19 తో ఓటమి పాలయ్యారు