ప్రభాస్ రాముడుగా, కృతి సనన్ సీతగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహించారు. ఈ భారీ చిత్రం దాదాపు 550 కోట్లతో రూపొందింది. జూన్ 16న ఆదిపురుష్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే.. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను కనీవినీ ఎరుగని రీతిలో తిరుపతిలో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ జరిగిన తర్వాత ఆదిపురుష్ పై అంచనాలు మరింత పెరిగాయి.
ఇక అసలు విషయానికి వస్తే.. పది రోజుల పాటు కష్టపడి ఈ భారీ ఈవెంట్ కు ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రేయాస్ మీడియా టీమ్ తో పాటు యూవీ క్రియేషన్స్ టీమ్ మెంబర్స్ కలిపి వంద నుండి నూట యాబై మంది వారం రోజులుగా తిరుపతిలో మకాం వేసి ఏర్పాట్లు చేశారు. అయోధ్యను తలపించే విధంగా భారీ ఎల్ ఈడీ స్క్రీన్ లను ఏర్పాటు చేయడం విశేషంగా ఆకట్టుకుంది. సాధారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు స్పాన్సర్స్ ఉంటారు కానీ.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎక్కడ కూడా స్పాన్సర్స్ లోగోలు కనిపించలేదు. అంటే మొత్తం ఖర్చు నిర్మాతలే భరించారన్న మాట.
మరి.. ఈ ఈవెంట్ కు ఎంత ఖర్చు అయ్యిందంటే… రెండు కోట్ల నుండి రెండున్నర కోట్లుగా ప్రచారం జరిగింది కానీ తాజా లెక్కల ప్రకారం చూస్తే ఈవెంట్ మొత్తానికి నాలుగు కోట్ల కు పైగానే ఖర్చు అయినట్లుగా తెలుస్తోంది. ముంబై నుండి యూనిట్ సభ్యుల రాను పోను విమాన ఖర్చులు మొదలుకుని అభిమానుల కోసం ఏర్పాటు చేసిన మంచి నీళ్ల వరకు లెక్క వేసుకుంటే నాలుగు కోట్లకు పైగానే ఖర్చు అయ్యిందని తెలిసింది. పోలీసు శాఖ వారు ఏర్పాటు చేసిన భద్రత మాత్రమే కాకుండా ప్రైవేట్ సెక్యూరిటీ భారీ గా ఏర్పాటు చేయడం జరిగింది.