Sunday, November 24, 2024
HomeసినిమాTakkar: నిజంగానే చాలా టక్కరోడు సుమీ!

Takkar: నిజంగానే చాలా టక్కరోడు సుమీ!

Mini Review: సిద్ధార్థ్ హీరోగా రూపొందిన ‘టక్కర్’ సినిమా నిన్ననే విడుదలైంది. డబ్బింగ్ సినిమానే అయినా, బడ్జెట్ పరంగా చూసుకుంటే ఈ వారం రిలీజైన సినిమాల్లో ఇదే పెద్దదని చెప్పాలి. కార్తీక్ జి క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్ధార్థ్ జోడీగా దివ్యాన్ష కౌశిక్ కథానాయికగా నటించగా, విలన్ గా అభిమన్యు సింగ్ కనిపించాడు. ట్రైలర్ చూడగానే ఈ సినిమా కోసం బాగానే ఖర్చు పెట్టారనే విషయం అర్థమవుతుంది. పసలేని కథకి ఇంత ఖర్చు చేశారా అనే సంగతి థియేటర్ కి వెళ్లిన తరువాత తెలుస్తుంది.

సాధారణంగా ఏదో ఒక గిమ్మిక్కు చేసేవాడినీ .. మసిబూసి మారేడుకాయ చేసే వాడినీ .. సమస్యల్లో నుంచి తెలివిగా బయటపడేవాడిని వాడు చాలా టక్కరోడురా అంటూ ఉంటారు. అలా వచ్చిందే ఈ సినిమా టైటిల్. ఈ టైటిల్ కి తగినట్టుగా తెరపై హీరోగారు జంతర్ మంతర్ ఏమైనా చేశాడా అంటే అలాంటిదేం కనిపించదు.  ఇక పేదరికం అనుభవించడం నా వల్ల కాదు .. బాగా డబ్బు సంపాదించాలనే బలమైన ఆశయంతో హీరో రంగంలోకి దిగుతాడు. కానీ టాక్సీ డ్రైవర్ గా తన్నులు తినడమే సరిపోతుంది.

ఇక ఖరీదైన కార్లను టాక్సీలుగా తిప్పే ఓనర్ ఈ సినిమాకి విలన్ అయ్యుంటాడనే రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. ఆ తరువాత విలన్ ఆయన కాదు .. ఈయన అంటూ అభిమన్యు సింగ్ ను చూపించారు. బుర్ర తక్కువ రౌడీలను వెంటేసుకుని తిరిగే విలన్ ఆయన. ఇక డబ్బులేదు .. జీవితంపై ఒక కచ్చితమైన అవగాహన లేదు . అయినా హీరో కాబట్టి అతన్నే ప్రేమించాలి .. పెళ్లాడాలి అనే ఆలోచనతో కనిపించే హీరోయిన్.

ఇలా సరదాగా తోచీ తోచక అల్లుకున్న కథకి మంచి ఖర్చును జోడించి అందించిన సినిమా ఇది. ఏ పాత్రకి ఒక వ్యక్తిత్వం అనేది ఉండదు. ఒక సరైన ఆలోచనా విధానం లేదు. మంచో చెడో .. ఒక మార్గంలో నడిచారనే ఫీలింగ్ లేదు. డబ్బున్నవాడిని అవుతానని కథ మొదట్లోనే హీరో భీష్మ ప్రతిజ్ఞ చేస్తే, ఎలాగబ్బా అని అంతా వెయిట్ చేస్తుంటారు. కానీ డబ్బున్న అమ్మాయిని లైన్లో పెట్టేసి, అలా కోటీశ్వరుడు అయ్యాడని అనుకోవాలి. ఈ విషయంలో మాత్రమే నిజంగానే చాలా టక్కరోడు సుమీ అనుకోవాలి. కొన్ని పాత సినిమాల క్లైమాక్స్ లో టైటిల్ ను గుర్తుచేసినట్టు!

RELATED ARTICLES

Most Popular

న్యూస్