సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. నేడు జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్ టైటిల్స్ విజేతగా అవతరించిన జకోవిచ్ టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న ఆటగాడిగా రికార్డ్ తన పేరుతో లిఖించాడు.
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ లో నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్ పై 7-6; 6-3;7-5 తేడాతో విజయం సాధించి ఈ ఏడాది వరుసగా రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ని గెలుచుకున్న జకోవిచ్ 22వ గ్రాండ్ స్లామ్ గెల్చుకొని అంతకుముందే ఈ ఫీట్ సాధించిన రఫెల్ నాదల్ సరసన నిలిచాడు. నేటి టైటిల్ తో నాదల్ ను అధిగమించి సమీప భవిష్యత్తులో ఎవరూ సాధించలేని ఓ సరికొత్త రికార్డు స్థాపించాడు.