నైరుతీ రుతుపవనాల తొలకరి రాక బెంగళూరు నగరాన్ని కుదిపేసింది. గత నెలలో కురిసిన భారీ వర్షాలను మరవకముందే.. కర్ణాటక రాజధాని బెంగళూరును మరోసారి వరదలు హడలెత్తించాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ పూర్తిగా నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పలు కాలనీల్లోకి వరద పోటెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Bengaluru Rains: బెంగళూరులో భారీ వర్షం
భారీగా కురిసిన వర్షానికి పోటెత్తిన వరదతో పలు కాలనీలు నదులను తలపిస్తున్నాయి. తూర్పు బెంగళూరు ప్రాంతంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన వైట్‌ఫీల్డ్ టౌన్‌షిప్‌లో భాగమైన వర్తుర్ లో 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో సమీపంలోని బెల్లందూరు చెరువుతోపాటు హల్లెనాయకనహళ్లి, వర్తూరు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నీరంతా ఔటర్ రింగురోడ్డువైపు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.