Friday, September 20, 2024
HomeTrending NewsRevenue: రెవెన్యూలో పదోన్నతులకు మోక్షం

Revenue: రెవెన్యూలో పదోన్నతులకు మోక్షం

రెవెన్యూ శాఖలో ప్రమోషన్ల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇవ్వడం సహా అన్ని క్యాడర్ల ప్రమోషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం సూచించారు . తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (TRESA ) అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ , అసోసియేట్ ప్రెసిడెంట్ మన్నె ప్రభాకర్ , ఉపాధ్యక్షులు పాక రమేష్ , కార్యదర్శులు నజీమ్ ఖాన్ , సైదులు , హైదరాబాద్ , నిజామాబాద్ జిల్లాల అధ్యక్షులు రామకృష్ణ , రమణారెడ్డి లు సోమవారం సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిశారు.

తహసీల్దార్ల కు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇవ్వడం తో పాటు అన్ని క్యాడర్ల వారికి ప్రమోషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు . దీనిపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అసోసియేషన్ ప్రతినిధులతో వెంటనే చర్చించి ప్రమోషన్ల ప్రక్రియ కు అవసరమైన విధివిధానాలు రూపొందించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ట్రెసా నాయకులు ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్