బర్మింగ్ హాం లోని ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన యాషెష్ సిరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించింది. 281 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆసీస్ నిన్న నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. చివరి రోజు 174 పరుగులు అవసరం కాగా తొలి సెషన్ వర్షం కారణంగా జరగలేదు. కేవలం 67 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. ఉస్మాన్ ఖవాజా 65 పరుగులతో రాణింఛి ఏదో వికెట్ గా వెనుదిరిగాడు. బొలాండ్-20; ట్రావిస్ హెడ్-16; కామెరూన్ గ్రీన్-28; అలెక్స్ క్యారీ-20 పరుగులు చేసి ఔటయ్యారు. 8 వికెట్లకు 227 పరుగులు స్కోరు ఉన్న దశలో కెప్టెన్ కమ్మిన్స్- నాథన్ లియాన్ లు 55 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి గెలిపించారు. కమ్మిన్స్-44; లియాన్-16 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
బెన్ స్టోక్స్ తో పాటు కీపర్ బెయిర్ స్టో చెరో క్యాచ్ మిస్ చేయడం ఆటను మలుపు తిప్పింది.
స్టువార్ట్ బ్రాడ్ 3; ఓలీ రాబిన్సన్ 2; మోయిన్ అలీ, జో రూట్, బెన్ స్టోక్స్ తలా ఒక వికెట్ సాధించారు.
ఉస్మాన్ ఖవాజా కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.
ఐదు టెస్టుల సిరీస్ లో ఆసీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ లార్డ్స్ మైదానంలో ఈనెల 28 న మొదలు కానుంది.