ఐసిసి వరల్డ్ కప్ క్వాలిఫైర్ టోర్నీలో బులావాయో అథ్లెటిక్ క్లబ్ వేదికగా నేడు జరిగిన మరో మ్యాచ్ లో ఒమన్ పై స్కాట్లాండ్ 76 పరుగులతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 320 పరుగులు చేయగా, ఒమన్ 244 పరుగులే చేయగలిగింది.
స్కాట్లాండ్ ప్లేయర్ బ్రాండెన్ మెక్ ముల్లెన్ 121 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 136; కెప్టెన్ బెర్రింగ్టన్ 62 బంతుల్లో 7 ఫోర్లతో 60 పరుగులతో సత్తా చాటగా… టోమాస్ మాకింటోస్ 32; మార్క్ వాట్ 25 పరుగులు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 320 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్ 5; ఫయ్యజ్ భట్ 2; జయ్ ఒదేద్రా ఒక వికెట్ పడగొట్టారు.
లక్ష్య సాధనలో ఒమన్ తన ఇన్నింగ్స్ ను నెమ్మదిగా మొదలు పెటింది. తొలి వికెట్ కు 10.1 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే చేసింది. నసీమ్ ఖుషి-69; షోహిబ్ ఖాన్-36; అఖిబ్ ఇలియాస్-31; అయాన్ ఖాన్-30 రన్స్ చేశారు.
స్కాట్లాండ్ బౌలర్లలో క్రిస్ గ్రీవ్స్ 5; మార్క్ వాట్, బ్రాండన్ మెక్ ముల్లెన్, అడ్రియన్ నీల్, మైఖేల్ లీస్క్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
సెంచరీ తో పాటు ఒక వికెట్ తీసిన బ్రాండెన్ మెక్ ముల్లెన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.