Sunday, November 24, 2024
HomeTrending NewsHusnabad: సాగునీరు అందక రైతన్న కష్టాలు - మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి

Husnabad: సాగునీరు అందక రైతన్న కష్టాలు – మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో ఆర్భాటాలు చేయడం తప్ప, రైతన్నకు సాగునీరు అందించడంలో విఫలమైందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి అన్నారు. పల్లె పల్లెకు ప్రవీణ్ అన్న గడప గడప కు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ప్రవీణ్ రెడ్డి బుధవారం చిగురుమామిడి మండలం గాగీరెడ్డి పల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల పేరు చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతన్నకు సాగునీరు అందించడం లేదన్నారు. మాయ మాటలు చెప్పి, మోస పూరిత వాగ్దానాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసిందన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి కనీసం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వ లేక పోయిందన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇస్తామని చెప్పి ఊరికి ఒక ఇల్లు కూడా కట్టివ్వ లేదని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలో అర్హులైన పేద లందరికీ ఎలాంటి పైరవీలు లేకుండా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామన్నారు. బీఆర్ఎస్ పార్టీ కనీసం అర్హులైన వారికి రేషన్ కార్డులు, పించన్లు అందించడంలో విఫలం అయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ వర్కర్లు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు,చేనేత కార్మికులు ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ పేషంట్లకు రూ. 4 వేల చేయూత్ పింఛను ఇవ్వడం జరుగుతుందన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి మాయ మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మభ్య పెట్టీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనీ అధికారం లోకి తీసుకువచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నేరవేర్చిన సోనియా గాంధీ ఋణం తీర్చు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిట్టి మల్ల రవీందర్, అధికార ప్రతినిదులు ఐరెడ్డి సత్య నారాయణ రెడ్డి, దాసరి ప్రవీణ్ కుమార్ నేత, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ సెక్రటరీ బోయిని నరేష్, కిసాన్ సెల్ అధ్యక్షులు కాంతాల మహిపాల్ రెడ్డి, మహిళా నాయకురాలు ఓరుగంటి భారతి దేవి పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్