ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగం ప్రధాన మంత్రి పర్యటించే ప్రాంతాల్లో ఈ నెల 8న గగనతలాన్ని నో ప్లై జోన్ ప్రకటిస్తూ వరంగల్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీచేసారు. ఈ ఉత్తర్వులను అనుసరించి ప్రధాన మంత్రి భద్రత దృష్ట్యా నేటి నుండి 8వ తారీకు వరకు వరంగల్, హనుమకొండ నగరానికి 20 కిలో మీటర్ల వ్యాసార్థంలో గగనతలాన్ని నో ప్లై జోన్ గా ప్రకటించడం జరిగింది. కావున డ్రోన్, రిమోట్ కంట్రోల్తో పనిచేసే మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్, పారాగ్లైడర్ లాంటివి ఎగరవేయడం పూర్తిగా నిషేధించబడ్డాయి. ఎవరైన వ్యక్తులుగాని, సంస్థలుగాని ఉత్తర్వులను అతిక్రమించినట్టయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేసారు.
ట్రై సిటీ పరిధిలో 144 సెక్షన్
అలాగే భారత ప్రధాని పర్యటన సందర్భంగా ట్రై సిటి పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేసారు. ఈ ఉత్తర్వులను అనుసరించి గుమికూడటం, ర్యాలీ, సభలు, సమావేశాలు నిర్వహించడం, మైకులు, స్పీకర్లు ఏర్పాటు చేయడంపై నిషేదిండం అమలు చేయబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు. నిషేదం రేపు ఉదయం 6గంటల నుండి 8 తారీకు సాయంత్రం 6గంటలకు అమలులో వుంటుందని. ఈ ఉత్తర్వులను అతిక్రమించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.