Sunday, November 24, 2024
Homeసినిమాస్పై థ్రిల్లర్ జోనర్ ను టచ్ చేయడం అంత వీజీ కాదు!

స్పై థ్రిల్లర్ జోనర్ ను టచ్ చేయడం అంత వీజీ కాదు!

తెలుగు తెరకి ‘స్పై’ థ్రిల్లర్ కథలు కొత్తేమి కాదు. అప్పట్లోనే సూపర్ స్టార్ కృష్ణ ఈ తరహా సినిమాలను ఎడా పెడా చేసిపారేశారు. అప్పట్లో ఇంత టెక్నాలెజీ లేకపోయినా కథలో బలం ఉండేది .. కథనంలో కొత్తదనం ఉండేది. స్పై ఏజెంటుగా కృష్ణ శత్రువుల స్థావరాల్లోకి రహస్యంగా ప్రవేశించడం, అనుకున్న ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్ గా ఫినీష్ చేయడం ఎంతో ఉత్కంఠ భరితంగా అనిపించేవి. బాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు ఏ స్థాయిలో చేశారనేది అప్పటికి  ఇంకా ఇక్కడి ఆడియన్స్ కి తెలియదు.

కానీ ఇప్పుడు ‘స్పై థ్రిల్లర్’ జోనర్లోని హాలీవుడ్ సినిమాల జాబితా సాధారణ ప్రేక్షకుడి అరచేతిలో ఉంది. తనకి ఏ సినిమా కావాలంటే ఆ సినిమాను చూసుకోగలడు. హాలీవుడ్ లో ఈ తరహా జోనర్లోని కథలే ఎక్కువగా కనిపిస్తాయి. వాళ్లకి అందుబాటులో ఉన్న టెక్నాలజీ వేరు .. ఒక సినిమా నిర్మాణం కోసం వాళ్లు తీసుకునే సమయం వేరు. అందువలన ఆ సినిమాల స్థాయి నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. అందువలన ఆ తరహా జోనర్ ను ఈ ట్రెండులో ఇప్పుడు టచ్ చేయడం ఒక సాహసంగానే చెప్పుకోవాలి .. ఒప్పుకోవాలి కూడా.

అయితే తెలుగులో అడివి శేష్ ‘గూఢచారి” హిట్ అయిన దగ్గర నుంచి మళ్లీ ఈ తరహా జోనర్ ను ఇతర హీరోలు టచ్ చేయడం మొదలుపెట్టారు. అలా వచ్చిన అఖిల్ ‘ఏజెంట్’ .. నిఖిల్ ‘స్పై’ సినిమాలు దెబ్బ తినేశాయి. ఇలాంటి యాక్షన్ సినిమాలు చేయడానికి కావలసింది బడ్జెట్ .. తుపాకులు .. తూటాలు కాదు. అనుక్షణం ఉత్కంఠను రేకెత్తించే కథాకథనాలు. స్పై గా వెళ్లిన హీరో .. ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించి వస్తాడనేది అందరికీ తెలుసు. కానీ ఏం చేస్తాడు? ఎలా చేస్తాడు? అనే అంశంపైనే ఇక్కడ దృష్టిపెట్టవలసింది. కావాల్సినంత కసరత్తు జరక్కుండా ఈ జోనర్ ను టచ్ చేస్తే ప్రమాదమే మరి!

RELATED ARTICLES

Most Popular

న్యూస్