యాషెస్ సిరీస్ మూడో టెస్టులో రెండోరోజూ బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 237 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 3 వికెట్లకు 68 పరుగులతో నేడు రెండోరోజు ఆట మొదలు పెట్టిన ఆ జట్టులో కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒక్కడే 80 పరుగులతో సత్తా చాటాడు. మిగిలిన వారిలో ఓపెనర్ జాక్ క్రాలే-33; మార్క్ వుడ్-24; మోయిన్ అలీ-21మాత్రమే రాణించారు. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ కమ్మిన్స్ 6 వికెట్లతో సత్తా చాటాడు. మిచెల్ స్టార్క్ 2; మిచెల్ మార్ష్, మర్ఫీ చెరో వికెట్ సాధించారు,
26 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కంగారూలు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేశారు. వార్నర్ (1); స్మిత్ (2) విఫలం కాగా.. ఉస్మాన్ ఖవాజా-43; లబుషేన్-33 రన్స్ చేశారు. ట్రావిస్ హెడ్-; మిచెల్ మార్ష్ -పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో మోయిన్ అలీ 2; బ్రాడ్, ఓక్స్ చెరో వికెట్ పడగొట్టారు.
ప్రస్తుతానికి ఆసీస్ 142 పరుగుల ఆధిక్యంలో ఉంది.