పశ్చిమ బెంగాల్‌లో ఇవాళ పంచాయితీ ఎన్నికలు జరగుతున్నాయి. కూచ్ బిహార్‌లోని సితాయిలో ఉన్న బారావిటా ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్‌ను ధ్వంసం చేశారు. బ్యాలెట్ పేపర్లకు నిప్పుపెట్టారు. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైంది.
మరోవైపు ఉత్తర 24 పరగణ జిల్లాలో ఉన్న పోలింగ్ బూత్‌కు వెళ్తున్న సమయంలో గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ను స్థానికులు అడ్డుకున్నారు. సీపీఐ మద్దతుదారులు ఆయన్ను నిలదీశారు. వాహనాన్ని ఆపిన ఆయన ఫిర్యాదులను స్వీకరించారు.
అన్ని జిల్లాల్లోనూ ఓటింగ్ కొనసాగుతోంది. పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు క్యూలైన్ కట్టారు. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని నందిగ్రామ్ బ్లాక్‌లో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పోలింగ్ బూత్‌ల వద్ద కేంద్ర బలగాలను వెనక్కి పంపాలని వాళ్లు డిమాండ్ చేశారు.
ముర్షీదాబాద్‌లో జరిగిన హింసలో 52 ఏళ్ల టీఎంసీ కార్యాకర్త సతీశుద్దిన్ షేక్ హత్యకు గురయ్యాడు. పోస్టు మార్టమ్ నిమిత్తం అతని మృతదేహాన్ని హాస్పిటల్‌కు తరలించారు. రేజినగర్, తుఫాన్‌గంజ్, ఖర్‌గ్రామ్ పట్టణాల్లో ముగ్గురు పార్టీ కార్యకర్తలను హత్య చేశారని టీఎంసీ ట్వీట్ చేసింది.