రాష్ట్రంలోని వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లు ఆడపిల్లలను అక్రమ రవాణా చేస్తున్నారంటూ నిన్న ఏలూరులో జరిగిన సభలో పవన్ ఆరోపించారు. ప్రతి కుటుంబంలో ఆడపిల్లలు, వితంతుల వివరాలు సేకరించి తద్వారా అక్రమ రవాణాకు పాల్పడ్డారని, కేంద్ర నిఘా వర్గాలవారే తనకు ఈ సంగతి చెప్పారని పవన్ వెల్లడించారు. దాదాపు 18 వేల మంది మిస్సింగ్ అయ్యారని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై గ్రామ వాలంటీర్లు మండిపడుతున్నారు. ఇవి అత్యంత బాధాకరమని, ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు అందించడానికి కృషు చేస్తున్నామని కరోనా సమయంలో తాము చేసిన సేవలు ఏమిటో, తాము పడిన కష్టం ఏమిటో అందరికీ తెలుసన్నారు. ఏలూరులో పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను వాలంటీర్లు దగ్ధం చేశారు.