Monday, September 23, 2024
HomeTrending NewsYuva Galam: 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: లోకేష్

Yuva Galam: 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: లోకేష్

అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని, దీనికి చంద్రబాబు నాయుడు సమర్ధ నాయకత్వమే శరణ్యమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు.  విశాఖను ఐటి రాజధానిగా చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, మన పిల్లలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళకుండా ఇక్కడే అవకాశాలు వచ్చేలా చూస్తామని హా మీ ఇచ్చారు. తమ హయంలో 6 లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించామని, 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు  ఎస్సీ, ఎస్టీ, బిసి,  మైనార్టీ కార్పోరేషన్ ద్వారా 2 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించామని చెప్పారు. తాము అధికారంలోకి పరిశ్రమలను తీసుకొచ్చి 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.  నెల్లూరు జిల్లా కొత్తపల్లి క్రాస్ రోడ్డు వద్ద ప్రజలతో రచ్చబండ నిర్వహించారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఆరు లక్షల మంది వృద్ధులకు పెన్షన్లు కట్ చేసిందని, తాము రాగానే వాటిని పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. కరెంట్ ఛార్జీలు పెంచుతున్న ఈ ప్రభుత్వం అదే కరెంట్ బిల్లు ఎక్కువయ్యిందన్న సాకుతో పెన్షన్ కట్ చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికి తొమ్మిదిసార్లు కరెంట్ ఛార్జీలు పెంచారని, వందల్లో రావాల్సిన బిల్లు వేల రూపాయలు వస్తోందని పలువురు తన దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. కరెంట్ ఛార్జీలు తగ్గించే బాధ్యత కూడా టిడిపి తీసుకుంటుందన్నారు. ఏపీపీఎస్సీని బలోపేతం చేసి యూపీఎస్సీ  మాదిరిగా  ఒక షెడ్యూల్ ప్రకారం పరీక్షలు, ఫలితాలు, ఇంటర్వ్యూ లు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.  స్కూళ్ళలో డ్రాప్ ఔట్స్ పెరుగుతూనే ఉన్నాయని, తాము దీనిపై ఓ స్పష్టమైన విధానానికి రూపకల్పన చేసి కరికులమ్ ను బలోపేతం చేస్తామని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్