డొమినికా టెస్టులో ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్లు సెంచరీలతో కదం తొక్కారు. నిన్న వికెట్ 80 పరుగులు చేసిన ఇండియా నేడు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 312 స్కోరు చేసింది. తొలి వికెట్ కు రోహిత్-జైస్వాల్ 229 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. రోహిత్ సెంచరీ (103) తరువాత అత్నాంజే బౌలింగ్ లో ఔటయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన శుభ్ మన్ గిల్ కేవలం 6 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. జైస్వాల్ 143; విరాట్ కోహ్లీ 36 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టెస్ట్ క్రికెట్ లో ఆరంగ్రేటం చేసిన తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన 17వ భారత ఆటగాడిగా జైస్వాల్ రికార్డు నమోదు చేసుకున్నాడు.