సెర్బియా సూపర్ స్టార్ నోవాక్ జకోవిచ్ మరో చరిత్ర రాయడానికి సిద్ధమయ్యాడు. నేడు జరిగిన వింబుల్డన్ సెమీ ఫైనల్లో ఇటలీ ప్లేయర్ జన్నిక్ సిన్నర్ పై 6-3; 6-4; 7-6(7-4) తేడాతో విజయం సాధించి మరో టైటిల్ పోరులో నిలిచాడు.
ఇప్పటికే 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెల్చుకొని తన పేరిట చరిత్ర సృష్టించుకున్న జకోవిచ్ 24వ టైటిల్ కూడా సొంతం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నాడు.
ఈ వింబుల్డన్ గెలిస్తే వరుసగా మూడేళ్ళు ఈ టైటిల్ గెల్చుకుని హ్యాట్రిక్ సాధించిన ఆటగాడిగా కూడా చరిత్ర తిరగరాయనున్నాడు.