Saturday, January 18, 2025
Homeసినిమాకూతురి కోసం చరణ్ హై రేంజ్ ప్లాన్!

కూతురి కోసం చరణ్ హై రేంజ్ ప్లాన్!

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్ ఉపాసనలు ముందుంటారు. ఈ దంపతులు ఇటీవల తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఈ జంట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వీరి వివాహం జరిగి దాదాపు 12ఏళ్లకు బిడ్డ జన్మించడంతో అందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఇక మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రామ్ చరణ్ కూడా కూతురు పుట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. బిడ్డను ఆస్పత్రి నుంచి తీసుకువెళ్లే సమయంలో పాప అచ్చం తనలానే ఉందని చెప్పి తన పుత్రికోత్సాహాన్ని కనపరిచారు.

తాజాగా రామ్‌చరణ్, ఉపాసనలు తమ మెగా ప్రిన్సెస్ కోసం ఓ లగ్జరీ రూమ్‌ని ఏర్పాటు చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోని తాజాగా ఉపాసన స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇంట్లో తమ కుమార్తెకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఇంటీరియర్ డిజైనింగ్ చేయించారు. ఈ మేరకు ప్రముఖ ఆర్కిటెక్ట్ పవిత్రా రాజారామ్ నేతృత్వంలో కామినేని నివాసంలోని క్లీంకార రూమ్‌ను స్పెషల్ గా డిజైన్ చేయించడం జరిగింది. అమ్రాబాద్ ఫారెస్ట్ వేదిక్ హీలింగ్ అంశాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ ఇంటీరియర్‌ను సిద్ధం చేసినట్లు ఆమె తెలిపారు. ఇక లగ్జరీ రూమ్ వీడియో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ లగ్జరీ రూమ్ అద్భుతంగా, అందంగా ఉందని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్