Friday, September 20, 2024
HomeTrending NewsProhibition & Excise: కొత్త గ్రామ పంచాయతీలకు కల్లు దుకాణాలు

Prohibition & Excise: కొత్త గ్రామ పంచాయతీలకు కల్లు దుకాణాలు

రాష్ట్ర వ్యాప్తంగా తాటి, ఈత, ఖర్జూర, గిరుక తాటి చెట్లకు నెంబరింగ్ ను వేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగష్టు 31 లోగా తాటి, ఈత, ఖర్జూర, గిరుక తాటి చెట్లకు నెంబరింగ్ ను పూర్తి చేయాలని ఈ సమీక్షలో ఆదేశించారు. రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని డా. B R అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లో ప్రోహిబిషన్ & ఎక్సైజ్ శాఖ పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయితీ లలో కల్లు దుకాణాలను మంజూరు చేసి TCS, TFT క్రింద లైసెన్సు లను మంజూరు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో తాటి, ఈత , ఖర్జూర, గిరిక చెట్లను నరికి వేసే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు ఆదేశించారు చెట్లను నరికి వేసే వారిపై కనీసం 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష & జరిమాన లను విధించేలా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కల్లు దుకాణాల తరలింపు, రద్దు చేయబడిన కల్లు దుకాణాల పునరుద్ధరణ క్షేత్ర స్థాయి (DC) లో జరిగేలా చూడాలని చర్యలు తీసుకోవాలన్నారు.

అలాగే, TFT లైసెన్సుల క్రింద కల్లు దుకాణాలను నిర్వహించబడుతున్న కల్లు దుకాణాల లోని మెజారిటీ సభ్యుల అంగీకారం తో TCS లుగా మార్చుకోవడానికి మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ గీత కార్మికులకు అవకాశం కల్పించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో ఉన్న ప్రభుత్వ భూములలో తాటి, ఈత, ఖర్జూర , గిరక తాటి చెట్లను పెంచాలన్నారు. సమీక్షా సమావేశం లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ గజ్జెల నగేష్, రాష్ట్ర ప్రోహిబిషన్ & ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ మమ్మద్ ముషారఫ్ ఫారూకి, అదనపు కమిషనర్ NA అజయ్ కుమార్, జాయింట్ కమిషనర్ లు KAB శాస్త్రి, SY ఖురేషీ, సురేష్ రాథోడ్, డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, సహాయ కమిషనర్ లు A . చంద్రయ్య గౌడ్, G . శ్రీనివాస్, అనీల్ కుమార్ రెడ్డి, ES లు A. సత్యనారాయణ, T. రవీందర్ రావు, D. అరుణ్ కుమార్, K. విజయ్ భాస్కర్, Ch. విజయ్, K. పవన్ కుమార్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్