మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. తెలంగాణా తో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి ప్రాజెక్టులు నిండిపోయి నీరు దిగువకు ప్రవహిస్తోంది. దీనితో ధవళేశ్వరం లోని కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నీటి మట్టం 9.3 అడుగులకు చేరుకుంది, మొత్తం 175 గేట్లు ఎత్తి నీటిని దాదాపు 4 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులు తున్నారు.
భద్రాచలం వద్ద కూడా నీటి మట్టం 40.8 అడుగులకు చేరింది. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.