Friday, September 20, 2024
HomeTrending NewsDaggubati: సీమ ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం: పురంధేశ్వరి

Daggubati: సీమ ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం: పురంధేశ్వరి

కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి యువతను మోసం చేసిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా తామే నిర్మిస్తానని చెప్పి ప్రగల్భాలు  పలికి గ్లోబల్ టెండర్లు పిలిచారని, కానీ ప్రాజెక్టు నిర్మాణం సాగడం లేదని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ సంగతి పక్కన పెట్టి కనీసం ఒక్క పరిశ్రమ అయినా ఈ ప్రాంతానికి వచ్చిందా అని ప్రశ్నించారు,  సీమ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వలసలు జరుగుతున్నాయని, ఉన్నత విద్యావంతులు కూడా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకుని ఇతర ప్రాంతాల్లో వాచ్ మెన్లు గా, లిఫ్ట్ మ్యాన్ లు గా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి రాయలసీమ జోన్ సమావేశంలో పాల్గొనేందుకు ప్రొద్దుటూరు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో మైనింగ్ కంపెనీలపై కేసులు పెట్టి వాటిని మూయించి, ఆ తరువాత వాటిని తనకు కావాల్సిన వారికి కట్టబెడుతున్నారని  పురంధేశ్వరి ఆరోపణ చేశారు.  కరవు ప్రాంతమైన రాయలసీమలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకొని సాగునీటికోసం  మల్లించాల్సిన అవసరం ఉన్నా… పోతిరెడ్డిపాడు, వెలిగొండ తూములు వెడల్పు చేయడం, గ గాలేరు-నగరి, హంద్రీనీవా, గుండ్రేవుల, సిద్దేశ్వర అలుగు, వేదవతి, సోమశిల, కందలేరు ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 780 కోట్ల రూపాయలు కంట్రాక్టర్ కు విడుదల చేశారని, కానీ 18శాతం పనులే జరిగాయని చెప్పారు. ప్రాజెక్టులకు కనీస మరమ్మతులు కూడా చేయించలేకపోతున్నారన్నారు.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోందని తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు.

పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత జోన్ల వారీగా కార్యకర్తలను కలుసుకోవాలని నిర్ణయించానని,  ఎన్టీఆర్ తనకు తాను ఈ ప్రాంతానికి దత్త పుత్రుడిన్ని అని చెప్పుకున్నారని, ఆయన బిడ్డగా తొలి పర్యటన కోసం  రాయలసీమకు  రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

ఎంపి సిఎం రమేష్, మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్