రేపు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.81 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందని, దీని దృష్ట్యా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, నదుల్లో వరద ప్రవాహం, సహాయ పునరావాస కార్యక్రమాలపై ముఖ్యమంత్రి సమీక్షించి, వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ఈ సందర్భంగా సిఎం పలు సూచనలు చేశారు.
- ధవళేశ్వరం వద్ద కూడా వరద ప్రమవాహం సుమారు 16 లక్షలకు చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు
- గత ఏడాది గోదావరిలో 26 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం చూశాం.
- కలెక్టర్లు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సహాయ పునరావాసం కార్యక్రమాలు అత్యంత సమర్థవంతంగా సాగాలి:
- అధికారులు మానవీయ కోణంలో సహాయం అందించాలి
- కలెక్టర్లు మాకు మంచి చేశారు అన్న మాటే వినిపించాలి
- లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇప్పటికే ఖాళీలు చేశారు, అవసరం అనుకుంటే… పరిస్థితిని అంచనా వేసుకుని మిగిలిన ప్రజలనుకూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
- సహాయ శిబిరాల నుంచి తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2వేలు రూపాయలు ఇవ్వండి. వ్యక్తులైతే వారికి రూ.1000లు ఇవ్వండి
- కచ్చా ఇళ్ల విషయంలో కలెక్టర్లు మానవీయ దృక్పథంతో ఉండాలి
వారిని తిరిగి పంపించేటప్పుడు వారికి రూ. 10వేల రూపాయలు ఇవ్వాలి - కచ్చా ఇంటి విషయంలో పాక్షికంగా దెబ్బతిందా? లేక పూర్తిగా దెబ్బతిందా? అన్న వర్గీకరణ వద్దు
- వాళ్లు ఉండేదే కచ్చా ఇళ్లు అయినప్పుడు వర్గీకరణ అనవసరం
- అలాంటి వారికి రూ.10వేల ఆర్థిక సహాయం ఇస్తే.. తిరిగి ఆ కచ్చా ఇంటిని మరమ్మతు చేసుకోవడానికి, తిరిగి కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది
- అందుకే మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్లును కోరుతున్నాను
- అలాగే ముంపునకు గురైన ఇళ్లు, అలాగే వరదనీరు ప్రవహించిన ఇళ్లు ఉన్న ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీచేయాలి. ఉదారంగా నిత్యావసరాలను పంపిణీచేయాలి
- 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ పామాయిల్, కేజీ కందిపప్పు ఇవ్వాలి
- ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఏడాది కూడా ఇలాంటి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం
- కంట్రోలు రూమ్స్ ఏర్పాటు చేయడం. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయివరకూ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి
- సచివాలయ స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయండి
- సచివాలయాల సిబ్బందిని, వాలంటీర్ల సేవలను పూర్తిగా వినియోగించుకోండి
- ముంపు బాధిత గ్రామాలమీద, లంకల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి
- తాగునీటి కొరత లేకుండా, తాగునీటి సరఫరా వ్యవస్థలు నిలిచి పోకుండా తగిన చర్యలు తీసుకోండి
- అలాగే ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయండి. విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీల్లో సరిపడా మందులను ఏర్పాటు చేసుకోండి
దీనిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకోవాలి - వరదనీరు తగ్గాక పంట నష్టం వివరాలను నమోదు చేసుకుని
- రైతులకు బాసటగా నిలిచేలా చర్యలు తీసుకోవాలి. అత్యంత పారదర్శకత పద్ధతిలో ఎన్యుమరేషన్ జరగాలి
అంటూ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.