Banglore: సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ‘లైగర్’. ఈ భారీ పాన్ ఇండియా మూవీని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించింది. విజయ్, పూరి కలిసి సినిమా చేస్తున్నారనగానే అంచనాలు ఓ రేంజ్ లో ఏర్పడ్డాయి. ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ అంచనాలు మరింతగా పెరిగాయి.
ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ అమ్మాయిల కలల రాకుమారుడు అనే ఇమేజ్ సొంతం చేసుకుంటున్నాడు. విజయ్ ‘లైగర్’ ప్రమోషన్స్ కోసం బెంగళూరు వెళ్లినప్పుడు ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే.. తేజు అనే అమ్మాయి తన అభిమాన హీరో విజయ్ ను ఎదురుగా చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. అంతేకాదు, దిష్టి తగలకుండా అప్పటికప్పుడు ఓ ఉంగరం తొడిగి తన ప్రేమను తెలియచేసింది. ఆమె ప్రపోజ్ చేసిన తీరు పట్ల విజయ్ అంతే ప్రేమతో స్పందించాడు.
ఆమెను దగ్గరికి తీసుకుని ఓదార్చాడు. అంతేకాదు, ‘లైగర్’ ప్రమోషన్లు పూర్తయ్యే దాకా ఆమె తన వేలికి తొడిగిన రింగ్ ను తీయనని మాటిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక లైగర్ మూవీ ఆగష్టు 25న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ వసూలు చేయడం ఖాయం అంటున్నారు సినీ జనాలు. మరి.. లైగర్ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.
Also Read: లైగర్ స్టోరీ ఇదే