Sunday, January 19, 2025
Homeసినిమా‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌ మోషన్ పోస్టర్

‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌ మోషన్ పోస్టర్

Galivaana: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అన్నపూర్ణ స్టూడియోస్ నుండి లూజర్ మరియు సంకెల్లు (తమిళంలోని విళంగు సిరీస్ నుండి డబ్బింగ్ సిరీస్) వంటి టాప్ నాచ్ సిరీస్ తర్వాత బిబిసి స్టూడియోస్‌, నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో బిబిసి స్టూడియోస్‌ నిర్మించిన యురోపియన్‌ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ‘గాలివాన’ అనే ఒరిజినల్‌ సిరీస్‌గా నిర్మిస్తోంది.


ఇందులో రాధికా శరత్‌ కుమార్‌, డైలాగ్ కింగ్ సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, శరణ్య ప్రదీప్, అశ్రిత, అర్మాన్ మరియు నందిని రాయ్, తాగుబోతు రమేష్‌, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్ టైటిల్ మరియు పాత్రలను వెల్లడించే మోషన్ పోస్టర్‌ను ఈరోజు విడుదల చేశారు. మోషన్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే.. ఈ వెబ్ సిరీస్ కథ ఏంటి ? రిలీజ్ ఎప్పుడు చేస్తారు..? అనేది త్వరలోనే తెలియజేయ‌నున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్